ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రాజశేఖర్ ‘కల్కి’ ఓవర్సీస్ టాక్ రాజశేఖర్ కు కొండంత బలాన్ని చేకూర్చే విధంగా ఉన్నట్లు ప్రాధమీక వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈమూవీ పై ప్రీ పాజిటివ్ రిలీజ్ టాక్ ఉన్న నేపధ్యంలో ఆ టాక్ కు బలంచేకూర్చే విధంగా ఈమూవీని చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు చెపుతున్న అభిప్రాయాలు ఉన్నాయి.

1983 నేపథ్యంలో సాగే ఈమూవీ కథతో ఓవర్సీస్ ప్రేక్షకులు కనెక్ట్ అయినట్లు టాక్. ‘కల్కి’ పాత్రలో రాజశేఖర్ యాటిట్యూడ్ యాక్టింగ్ హైలైట్ గా మారిందనీ ఈమూవీని చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాజశేఖర్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందనే మాట వినిపిస్తోంది. 

దీనితో కల్కి’ గ్యారెంటీ హిట్ అన్న మాటలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆదా శర్మ నందితా శ్వేత పూజితా పొన్నాడ స్కార్లెట్ విల్సన్ గ్లామర్ కు మాస్ ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతారు అన్న కామెంట్స్ వస్తున్నాయి. టెక్నికల్ గా కూడ ఈమూవీ నిర్మాణ విలువలు బాగా ఉండటంతో అటు క్లాస్ ప్రేక్షకులను ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించడంలో ‘కల్కి’ ప్రాధమీకంగా హిట్ సాధించినట్లుగా భావించాలి. 

అయితే అనూహ్యంగా ఈరోజు విడుదలైన ‘బ్రోచేవారు ఎవరురా’ ‘కల్కి’ సినిమాలు రెండింటికి ప్రాధమికంగా పాజిటివ్ టాక్ వచ్చిన నేపధ్యంలో ఈ రెండు సినిమాలలో వచ్చే వారం విడుదల కాబోతున్న సమంత ‘ఓ బేబి’ మ్యానియాను తట్టుకుని ఏసినిమా నిలబడగలుగుతుంది అన్న విషయం బట్టి ఈ రెండు సినిమాల ఫైనల్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ‘కల్కి’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో రాజశేఖర్ జోష్ లో ఉన్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: