టాలీవుడ్‌లో ఇటీవ‌ల మ‌ల్లూవుడ్ భామ‌ల హంగామా ఎక్కువ అవుతోంది. మాళ‌యాళ భామ‌లు త‌మ అందంతో పాటు టాలెంట్‌తో ఇక్క‌డ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే నివేదా థామ‌స్ కూడా ఇక్క‌డ ఎన్టీఆర్ లాంటి హీరోల‌తో న‌టించ‌డంతో పాటు స‌రైన బ్రేక్ కోసం వెయిటింగ్‌లో ఉంది. తాజాగా ఆమె శ్రీ విష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వ‌చ్చి బ్రోచేవారెవరురా సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది.


ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఆమె జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేసింది. సాధ్యమైనంత వరకూ ఎక్కువ సినిమాల్లో నటించడానికే ప్రయత్నిస్తున్నాన‌ని చెప్పిన నివేద చాలా గ్యాప్ త‌ర్వాత బ్రోచేవారెవరురాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోన్నందుకు చాలా ఆనందంగా ఉంద‌ని చెప్పింది. ఇక ఎన్టీఆర్ స‌ర‌స‌న ఆమె జై ల‌వ‌కుశ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. 


ఈ సినిమాలో చిన్న పాత్ర‌లో ఎందుకు న‌టించార‌న్న ప్ర‌శ్న‌కు ఆమె ఆన్స‌ర్ ఇస్తూ త‌న‌కు ఎన్టీఆర్ గారంటే చాలా ఇష్ట‌మ‌ని... ఆయ‌నపై ఉన్న ఇష్టంతో ఆయ‌న‌తో ఒక్క సినిమాలో అయినా చేయాల‌నే తాను జై ల‌వ‌కుశ సినిమాలో చేశాన‌ని.. అందుకే పాత్ర టైంతో సంబంధం లేకుండా ఆ సినిమా ఒప్పుకున్నాన‌ని చెప్పింది. ఒక్క నివేద మాత్ర‌మే కాదు... ఎంతో మంది యంగ్ హీరోయిన్లు ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ డ్యాన్సులు అంటే ఇష్ట‌మ‌ని చెపుతుంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: