పవన్ అంటే పవర్.. మంచికి మారుపేరు. సామాజిక చైతన్యం కలిగిన వ్యక్తి గా సినిమా రంగంలో మంచి ఫాలోయింగ్ ఉంది. పదహారు సంవత్సరాల క్రీతం 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో రంగప్రవేశం చేసిన పవన్ తన సినిమా కెరీర్ లో అప్ ఆండ్ డౌన్ వచ్చినప్పటికీ మెగ ఫ్యామిలి పేరు మాత్రం నిలుపుకుంటూ వచ్చాడు. రీసెంట్ గా గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలతో ఒక్కసారే సినిమా రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు పవన్.  తనతో సినిమా అంటే మినిమమ్ గ్యారంటే అనే రేంజ్ నుంచి తనతో సినిమా అంటే బంబర్ హిట్టే అన్న స్థాయికి పవన్ తన క్రేజిని పెంచాడు.సాదారనంగా సినిమాలో హీరోయిజం చూపిస్తే అబ్బో హీరో ఇలా చేశాడు అలా చేశాడు అని మెచ్చుకుంటారు. కానీ పవన్ కల్యాన్ నిజజీవితంలోనూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నవిషయంఎంత మందికి తెలుసు. రాష్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో జరిగిన ప్రకృతి ప్రమాదాలకు ప్రజలు చిన్నాభిన్నం అయితే వెంటనే స్పందించి తన వంతు ఆర్థిక సహాయం అందించాడు. అలాగే ఆయన ఫ్యాన్స్కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఏదేమైనా పవన్ కళ్యాన్ తెరపైనే మంచిని పంచడం కాదు నిజ జీవితంలో కూడా అంతే మంచిని పంచుతాడని ఆయన ఫ్యాన్సే కాదు సేవా దృక్పదం ఉన్నవారు ప్రతి ఒక్కరూ అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: