చిరంజీవి రాజకీయాలలోకి వెళ్ళనంతసేపు మెగా కుటుంబ హీరోలందరూ మెగాస్టార్ చిరంజీవినే అనుసరిస్తూ తమ కెరియర్ ని మలుచుకుంటు ఉండే వారు. చిరంజీవి రాజకీయాల బాట పట్టిన తరువాత ఆ స్థానాన్ని పవర్ స్టార్ పవన్ తీసుకున్నాడు అని అంటారు. ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న వరుణ్ తేజ్ కు పవన్ కళ్యాణ్ నటనకు సంబంధించిన తర్ఫీద్ ఇవ్వడం అలాగే తన మేనల్లుడు సాయి ధర్మతేజ్ కు నటనకు సంబంధించిన టిప్స్ ఇవ్వడం ఈ విషయాలన్నీ చూస్తూ ఉంటే మెగా కుటుంబానికి సినిమా రంగానికి సంబంధించినంత వరకు పవన్ రోల్ మోడల్ గా మారాడని అంటున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంపరర్ స్థానానికి ఎదిగిన పవన్ కు టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లను తన కనుసన్నలలో నిలుపు కుంటు వారి సినిమాలలోనే నటించాలి అన్న ప్రయత్నం పవన్ ఎప్పుడూ చెయ్యడు అని అంటారు. ‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్ కాక ముందు పవన్ తనకు టాలీవుడ్ లోని క్రేజీ డైరెక్టర్లు అందరు తనకు పరిచయం ఉన్నా ఏనాడు వారికి ఫోన్ చేసి తనకు వారి సినిమాలలో నటించాలని ఉంది అని మార్కెట్ చేసుకోవడం పవన్ కు రాదు అంటారు. నటన విషయంలో పవన్ కళ్యాణ్ ను రామ్ చరణ్ అనుసరించకపోయినా టాప్ డైరెక్టర్లను మేనేజ్ చేసే విషయంలో తన బాబాయ్ లాగే చెర్రీ కూడా వెనకబడి ఉన్నాడు అని అంటారు.
‘తుఫాన్’ సినిమా పరాజయం చెందిన తరువాత రామ్ చరణ్ కు పూరి జగన్నాద్, వినాయక్, రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి ప్రముఖ దర్శకులతో పరిచయాలు ఉన్నా తనను తాను తన బాబాయ్ లాగే మార్కెట్ చేసుకోడని అందువల్లనే రామ్ చరణ్ కొత్త సినిమా ప్రారంభం అవడానికి ఇంత టైమ్ గ్యాప్ పట్టడమే కాకుండా తనను కోరుకుంటున్న కృష్ణవంశీ కి చరణ్ తన డేట్స్ ఇచ్చాడు అని అంటారు. పవన్ చరణ్ ల మధ్య బేధాభిప్రాయాలు ఉన్నా దర్శకుల విషయంలో మాత్రం వీరిద్దరి ఆలోచనా ఒకటే అని అనిపిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి