‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి సంబంధించిన ఆఖరి బ్రహ్మాస్త్రం నిన్న సాయంత్రం విశాఖలో విడుదల అయింది. ‘బ్యాంగ్ బ్యాంగ్’ అంటూ తమన్నా మహేష్ లు తమ స్టెప్స్ తో అదరుకోట్టిన ఈ స్పెషల్ సాంగ్ కు మహేష్ అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. 

అయితే స్పెషల్ సాంగ్స్ కు ట్యూన్స్ అందివ్వడంలో సిద్ధహస్తుడైన దేవీశ్రీప్రసాద్ స్థాయిలో ఈపాట ట్యూన్ లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ‘కెవ్వు కేక-నేను పక్కా లోకల్’ స్పెషల్ సాంగ్స్ ట్యూన్స్ రేంజ్ లో ఈపాట ఉంటుంది అని ఆశించిన వారికి మాత్రం ఈపాట ట్యూన్ పెద్దగా కనెక్ట్ అవ్వకపోవడంతో ఈ పాటకు కూడ ఏవరేజ్ మార్కులే పడుతున్నాయి. 

ఈ స్పెషల్ సాంగ్ ట్యూన్ లో ఉన్న లోపాలను కవర్ చేస్తూ ఈ పాటలో మహేష్ వేసిన స్టెప్పులు ఈ పాటకు అందం తీసుకువచ్చింది. అయితే ఈపాటలో మహేష్ తో పోటీ పడటమే కాకుండా తమన్నా తన స్టెప్స్ తో ఈ ‘డ్యాంగ్ డ్యాంగ్’  పాటకు విపరీతమైన క్రేజ్ ను తీసుకు వచ్చింది. దీనితో ఈపాటకు యూట్యూబ్ లో విపరీతమైన హిట్స్ వస్తున్నాయి. ఈపాటకు వస్తున్న స్పందను చూసి ఆనందపడ్డ మహేష్ ఈ పాట విషయంలో ఒక సూచన చేసాడు.

 ఈ పాటను ప్రశంసిస్తూ మీడియా వర్గాలు చేస్తున్న కామెంట్స్ కు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈపాటకు ఐటమ్ సాంగ్ లేదంటే స్పెషల్ సాంగ్ అంటూ కామెంట్స్ రాయవద్దని ఈపాటకు పార్టీ సాంగ్ అంటూ గౌరవాన్ని కలిగించమని మహేష్ మీడియా వర్గాలకు విమర్శకులకు విజ్ఞప్తులు చేస్తున్నాడు. ఇప్పుడు ఈపాట కూడా బయటకు వచ్చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ దగ్గర ఉన్న అస్త్రాలు అన్నీ ఇంచుమించు అయిపోయినట్లు లెక్క. దీనితో ఆడియో పరంగా ఫైనల్ రిజల్ట్ పరిగణలోకి తీసుకుంటే ‘సరిలేరు నీకెవ్వరు’ పాటల పై ‘అల వైకుంఠపురములో పాటలు పూర్తి ఆదిపత్యాన్ని కొనసాగిస్తూ మహేష్ కు పరోక్షంగా టార్చర్ పెడుతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: