రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్. రెండు భాగాలుగా రిలీజ్ అయిన బాహుబలి బాలీవుడ్ సినిమాలకు కూడా సాధ్యం కాని వసూళ్లు సాదించటంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా సక్సెస్ తర్వాత ప్రభాస్.. ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అనుకున్నట్టుగానే ఈ సినిమాకు ఫస్ట్ డే అన్ని భాషల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. మొదటి రోజే ఈ సినిమా ఓవరాల్‌గా రూ.138 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
అయితే ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఘోర అవమానం జరిగింది. సాహో సినిమా రిలీజ్‌కు ముందు భారీ క్రేజ్ వచ్చింది. అయితే, దాన్ని నిర్మాతలు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ, అప్పుడు వారు వేసిన రాంగ్ స్టెప్ వల్ల ఇప్పుడు ప్రభాస్ నిర్మాతలకు కష్టాలను, యంగ్ రెబల్ స్టార్‌కు అవమానాన్ని మిగిల్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. సాహో సినిమాను టీవీలో ప్రసారం చేసే హక్కుల కోసం గతంలో చాలా మంది పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో దాదాపు రూ.90కోట్ల మేర మార్కెట్ వచ్చింది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు అంత ధర పెట్టి కొనడానికి భయపడ్డారు.
కానీ.. హిందీలో మాత్రం ఓ ఛానల్ టీవీ ప్రసార హక్కులను కొనుక్కుంది. ఇక సాహో సినిమా తెలుగులో అనుకున్నంత లాభాలు తెచ్చిపెట్టలేదు. దీంతో సినిమా రిలీజ్ తర్వాత దాన్ని కొనేందుకు టీవీ ఛానల్స్ వెనక్కి తగ్గాయి. అదే సమయంలో డిజిటల్ మీడియా అమెజాన్‌లో సాహో టెలికాస్ట్ అయిపోయింది. దీంతో ఇప్పుడు రేటు తగ్గించినా కూడా ఏ తెలుగు టీవీ ఛానల్స్ కూడా సాహో సినిమాను కొనేందుకు ముందుకు రావడం లేదని తెలిసింది. ఏదేమైనా భారీ బడ్జెట్‌తో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రం కొనడానికి ముందుకు రాకపోవడం నిజంగా ఘోర అవమానం అనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి