మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అలా బ‌య‌ట‌కు వ‌చ్చేసిన నాగ‌బాబు జి తెలుగులో వచ్చే లోకల్ గ్యాంగ్స్ షోలో కనిపించడంతో ఇందులోనే ఉంటాడని అనుకున్నారు.  కానీ.. ఆదివారం వ‌స్తున్న  మరో కామెడీ షోలో కూడా నాగబాబు ఉంటున్నాడు. `అదిరింది` పేరిట వచ్చే ఈ షోలో నాగబాబు ఉండడంతో  ఈ షో పై అందరి దృష్టి మళ్లింది. ఈ షోకు యాంక‌ర్‌గా  సమీరా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక ఆదివారం ప్రసారం అవుతున్న అదిరింది షో మొన్నటితో రెండవ వారం కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ అదిరింది కామెడీ షోకు రేటింగ్‌ యావరేజ్‌గా వచ్చింది.

 

నెటిజన్స్‌ నుండి మంచి స్పందన వ‌చ్చినా... ఆదివారం అయ్యేప్పటికి సినిమాలపై జనాలు ఎక్కువ ఫోకస్‌ పెట్టి అదిరిందిని తక్కువ చూసినట్లుగా అనిపిస్తుంది. మ‌రోవైపు జీ తెలుగులో ఇప్పటి వరకు చాలా షోలు వచ్చాయి.వాటితో పోల్చితే ఇది చాలా ఉత్తమ రేటింగ్‌ అంటూ కూడా బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు. కానీ.. అదిరింది కామెడీ షోకు జబర్దస్త్‌ తో పోల్చితే చాలా తక్కువ రేటింగ్‌ వచ్చిందని తెలుస్తోంది. అలాగే  ఆదివారం ప్రసారమైన ఈ షో జబర్దస్త్ కి జిరాక్స్ లా అనిపించిందని నాగబాబు అభిమానులే అంటున్నారు. లోగో దగ్గర నుంచి.. స్కిట్ ల వరకూ జబర్దస్త్ కి కొనసాగింపులా ఉంది తప్ప మరో కొత్త షో చూసిన అనుభూతి దక్కలేదని వీక్షకులు పెదవి విరుస్తున్నారు. 

 

ఇదిలా ఉంటే.. జబర్దస్త్ షో లో నాగబాబు న్యాయ నిర్ణేతగా మాత్రమే ఉండేవారు. ప్రచార కార్య్కర్మాణాలను పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ, అదిరింది షో కి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. టీమ్ ఎంపిక దగ్గరనుంచి ప్రమోషన్ వరకూ అన్నిటినీ నాగబాబు తన భుజాల మీద వేసుకున్నారని తెలుస్తోంది. ఇక అతి త్వరలోనే గురు మరియు శుక్రవారాల్లో ఈ షోను ప్రసారం చేయబోతున్నట్లుగా నాగబాబు ప్రకటించాడు.అందుకే అప్పుడు జబర్దస్త్‌ను ఢీ కొట్టబోతుంది.ఆ సమయంలో రెండింటిలో ఏది పవర్‌ ఫుల్‌ అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: