బూమ్ అనే సినిమాతో బాలీవుడ్ కి నటిగా ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్, ఆ తరువాత టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించింది. అనంతరం కొంత విరామం తరువాత నందమూరి బాలకృష్ణ సరసన అల్లరి పిడుగు అనే సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఆపైన బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు పట్టేసిన కత్రినా, అనతి కాలంలోనే అక్కడి అగ్ర నటుల సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు దక్కించుకుంది. దానితో పాటు అక్కడక్కడా కొన్ని సినిమాల్లో కూడా ప్రత్యేక గీతాల్లో కూడా చిందేసి, 

 

కుర్రకారుకి పిచ్చెక్కించిన కత్రినా కైఫ్, తనకు ప్రస్తుతం 34 ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం వన్నె తరగని అందంతో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అలానే సమయానికి మంచి పోషకవిలువలు ఉన్న ఆహారం తీసుకోవడంతో పాటు, మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడమే తన సౌందర్య రహస్యం అని కత్రినా అంటుంటారు. ఇకపోతే తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పర్సనల్, సినిమా సంగతులను ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంటుంది కత్రినా. 

 

ఇక మొన్న జరిగిన ఒక బీచ్ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో భాగంగా మంచి హాట్ డ్రెస్ లో దర్శనం ఇచ్చి అక్కడి వారిని ముగ్ధుల్ని చేసింది. ఎంబ్రాయిడరీ చేసిన మోడరన్ స్టైల్ అవుట్ఫిట్ తో తన యద అందాలతో పాటు నడుము ఒంపులు కనపడేలా వేసుకున్న ఆ డ్రెస్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది కత్రినా. ఇక ఈ ఫోటోలు చూసిన పలువురు కత్రినా ఫ్యాన్స్, వావ్ వాట్ ఏ బ్యూటీ, ఈ విధంగా అంగాంగ ప్రదర్శన చేసి మా గుండెలు బద్దలు చేస్తున్నావు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.....!!  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Write it on your heart that every day is the best day of the year 💕 #2020

A post shared by Katrina Kaif (@katrinakaif) on

మరింత సమాచారం తెలుసుకోండి: