యాంగ్ రెబల్ స్టార్.. సారీ సారీ ప్రస్తుతం ఆయనకు 40 ఏళ్ళు. ఇంకా యాంగ్ కాదు.. కేవలం రెబల్ స్టార్ అంతే. అతను ఎవరో కాదు ప్రభాస్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తీసి యాక్షన్ హీరో.. డార్లింగ్ అని అనిపించుకుని బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ ప్రభాస్.. ఇప్పటి వరుకు పెళ్లి చేసుకోలేదు. 

 

అది ఏంటో మరి.. ప్రభాస్ పెళ్లి అంటే చాలు వెకడుగు వేస్తాడు. ఒక్క ప్రభాస్ ఏ కాదు.. వాళ్ళ పెద్ద నాన్న, పెద్దమ్మ కూడా ప్రభాస్ పెళ్లి అంటే చాలు మాట మార్చేస్తారు. అది ఎందుకు అని అంటే ? ఇంకా మంచి సినిమాలు తియ్యాలి.. అప్పుడే ప్రభాస్ కు పెళ్లి ఏంటి అని అంటారు.. ప్రభాస్ చిన్నపిల్లోడు కాదయ్యా బాబు అని అన్న కూడా అలాగే చెప్తారు. 

 

అయితే వాళ్ళు ఆలా మాట దాటేసిన.. ప్రభాస్ కు మొదటి నుండి కొద్దిమంది నటులతో లవ్ అని త్వరలో పెళ్లి అని అభిమానులు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తూనే ఉంటారు.. అయితే ఇన్నాళ్లు ప్రభాస్ అనుష్క అని అన్న అభిమానులు.. ఇప్పుడు మరో నటితో ప్రభాస్ కు 13 ఏళ్ళ క్రితమే వాళ్ళ పెద్దనాన్న కారణంగా బ్రేకప్ అయ్యింది అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆ వార్తలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. 

 

అయితే ఇప్పుడు ప్రభాస్ పెళ్లిపై మరో సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే.. ప్రభాస్ కు పెళ్లి గండం ఉంది అని.. అందుకే ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదు అని.. మరో సంవత్సరంలో ఆ పెళ్లి గండం పోతుంది అని.. అప్పుడే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ప్రభాస్ కు పెళ్లి గండం ఉందా? అందుకే పెళ్లి చేసుకోవడం లేదా? లేక మరేదైనా కారణం వల్ల చేసుకోవటం లేదా అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: