మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తనదైన దారిలో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా, తన మేనరిజంతో, నటనతో యువతని తన వైపుకు తిప్పుకుని తనకంటూ సొంత అభిమాన గణాన్ని ఏర్పర్చుకోగలిగాడు. ఒక దశలో పవన్ స్టార్ డమ్ మెగాస్టార్ ని మించిపోతుందేమో అన్న అనుమానం కూడా కలిగింది.
అయితే అలాంటి టైమ్ లో తనని తాను తగ్గించుకుని ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కి స్నేహితులు చాలా తక్కువ. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఎవరితో ఎక్కువ కలవడు, అంత తొందరగా ఎవరితోనూ కలవలేడు. అందుకే పవన్ కళ్యాణ్ కి స్నేహితులు చాలా తక్కువ. కానీ ఒక్కసారి స్నేహం చేసాడంటే మాత్రం అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ విషయం పవన్ తో ఎక్కువ స్నేహంగా ఉండేవారిని అడిగితే తెలుస్తుంది.
స్నేహితులు తక్కువ ఉన్న పవన్ కి అభిమానులు చాలా ఎక్కువ. వరుసగా పదకొండు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పవన్ కళ్యాణ్ నిలబడగలిగాడంటే అది అతని అభిమానుల వల్లే అని చెప్పాలి. మరి పవన్ కళ్యాణ్ కి అంత అభిమానులెందుకు ఉన్నారనే ప్రశ్న చాలా మందికి అర్థం కాదు. పవన్ కళ్యాణ్ అభిమాని అయితే తప్ప, ఎందుకు అంత అభిమానం చూపిస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ సైతం పవన్ అభిమానులుగా ఉన్నారు.
అయితే ఇంత అభిమానం ఎందుకు.. ఎందుకింత అభిమానులు ఉన్నారనేది చాలా మందికి అర్థం కాని ప్రశ్న.. అయితే దీనికి సమాధానం ఒక్కటే. పవన్ కళ్యాణ్ సినిమాలని చూసి అభిమానించే వారికంటే ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానించే వారే ఎక్కువ. సమాజం పట్ల పవన్ చూపించే శ్రద్ధ చాలా తక్కువ మందికి ఉంటుంది. సమస్యలకి ఆయన స్పందించే తీరు, సమాజం పట్ల చూపే బాధ్యత మొదలగు విషయాలే పవన్ కి అభిమానులని పెరిగేలా చేశాయి.
click and follow Indiaherald WhatsApp channel