తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తమదైన ముద్ర వేశారు మెగా వారు. చిత్ర సీమలో మెగా ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన కొణిదెల వరప్రసాద్ సినిమా రంగంలో అడుగుపెట్టి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిరంజీవిగా ఎదిగాడు. ప్రజలు అభిమానంతో మెగస్టార్ గా పిలుచుకున్నారు. ఇలా మెగా ప్రస్థానం మొదలు ఆయన తమ్ముడు నాగబాబు ఈయన అన్నతో పాటు కొన్ని సినిమాల్లో నటించి తర్వాత నిర్మాతగా మారి సినిమా నిర్మాణం చేపట్టాడు.
చిరంజీవి నట వారసత్వంగా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్ర సీమలో తన దైన ముద్ర వేశారు. అన్న ఇమేజ్ ను ఏమాత్రం వాడుకోకుండా తనదైన ముద్ర మెగా అభిమానుల్లో వేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ నట వారసుడు రాం చరణ్ ఎంట్రీ వారసత్వం నుంచి వచ్చనప్పటి తన తండ్రి సూచనలు,సలహాలతో తనదైన ఇమేజ్ ను మెగా అభిమాన్లో చాటుకున్నాడు. ఏదేమైనప్పటికి మెగా ఫ్యామిలి నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాన్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయిపోయాడు. పవనీజం అనే మానియానే సృష్టించాడు.
ఇక ఇప్పడు ఇయన ప్రోత్సాహంతో పవన్ సొంత (అక్క) చిరంజీవికి (చెల్లెలు) కొడుకు సాయి ధర్మతేజ్ సినీ రంగం ప్రవేశం చేశాడు. వై.వి.ఎస్. చౌదరి నిర్మించి దర్శకత్వం వహించిన ‘రేయ్’ సినిమాకు పవన్ ఆశిస్సులు చాలా ఉన్నాయని తెలిసింది. కారణం సినిమా ఆడియో ఫంక్షన్ లో పవన్ చేసిన సందడి చూస్తేనే తెలుస్తుంది. సో... తన అల్లుడు సినిమా ఇండస్ట్రీలో మంచి పొజీషన్ రావాలన మామయ్య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని అశిద్దాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి