సాధారణంగా హీరోలు హీరోయిన్స్ ను ఏడిపిస్తూ ఉంటారు. కానీ.. ఓ హీరోయిన్ మాత్రం ఎప్పుడూ హీరోలను టీజ్ చేస్తూనే ఉంటుంది. ఒక సినిమా అంటే ఓకే. ప్రతి సినిమాలోనూ ఇదే తంతు. తెలుగు, తమిళం అనే తేడాలేకుండా హీరోలందరినీ డామినేట్ చేస్తోంది సాయిపల్లవి. 

 

సినిమా ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువ. హీరోల కంటే తామేమీ తక్కువ కాదంటూ కొందరు ముద్దుగుమ్మలు బాహాటంగానే విమర్శించారు. అయితే సాయిపల్లవి మాత్రం హీరోలను డామినేట్ చేస్తోంది. సాధారణంగా టీజర్ లో హీరోయిజాన్ని హైలెట్ చేస్తారు. స్టార్స్ సినిమా టీజర్స్ లో ఒక్కోసారి హీరోయిన్ సింగిల్ ఫ్రేమ్ లో కూడా కనిపించదు. కానీ ఫిదా టీజర్ ఈ అమ్మడితోనే మొదలైంది. పోకిరి కుర్రాడికి తెలంగాణ యాసలో ఇచ్చిన వార్నింగ్ తో అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది. క్రేజీ యంగ్ హీరో నాని సైతం.. సాయిపల్లవి డామినేషన్ కు తగ్గాల్సి వచ్చింది. ఎంసీఏ టీజర్ నానితో మొదలైనా.. సాయిపల్లవి రాకతో కథను తనవైపు తిప్పుకుంది.

 

ఎంసీఏ మాదిరి పడిపడిలేచె మనసులో మరోసారి డేరింగ్ అండ్ డాషింగ్ రోల్ పోషించింది సాయిపల్లవి. సైట్ కొడుతున్న హీరో దగ్గరకు వచ్చి.. ఏంటి లైనేస్తున్నావా అని అడిగే డేరింగ్ రోల్ ను పోషిస్తోంది సాయిపల్లపి. సినిమాకు హైప్ క్రియేట్ చేయడానికి సాయిపల్లవి డామినేషన్ ఉపయోగపడుతోంది. తెలుగులోనే తమిళంలోనూ డామినేషన్ కొనసాగిస్తోంది సాయిపల్లవి. మారి 2 సినిమాలో ధనుష్ తో జత కట్టగా.. ట్రైలర్ లో రౌడీ బేబీగా ఇందులోనూ.. తన పెత్తనాన్ని కొనసాగించింది ఈ హైబ్రీడ్ పిల్ల. 

 

అదేమిటో గానీ.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ క్యారెక్టర్స్ సాయిపల్లవిని వరిస్తున్నాయి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న లవ్ స్టోరీలోని ఏ పిల్ల సాంగ్ ను రిలీజ్ చేస్తే.. సాయిపల్లవే హైలైట్ గా నిలిచింది. మెట్రో ట్రైన్ లో చైతుకు ఘాటైన ముద్దు పెట్టడంతో హీరో ఏడ్చేశాడు. చూస్తుంటే.. ఈ లవ్ స్టోరీలో డామినేషన్ మొత్తం ఈ అమ్మడిదే కాబోలు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: