ముందుగా ఊహించినట్టుగానే తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేందుకు శనివారం అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాస్త గందరగోళం సృష్టించడంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులను ను ఉద్దేశించి ఎన్నిసార్లు వారించినా  వారు మాట వినక పోవడంతో వారిని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

IHG


గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఎంఐఎం పక్షనేత  అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు. ఆ తరువాత కెసిఆర్ మాట్లాడుతుండగా తమకు మరిన్ని అంశాలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పీకర్ పోడియం వైపు దూసుకు వచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ కేసీఆర్ సమాధానం చెప్పిన తర్వాత మీకు అవకాశం ఇస్తామని చెప్పినా వారు తమ నిరసనను ఆపలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, కెసిఆర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.


 శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రతిపాదించగా, వెంటనే దానికి స్పీకర్ ఆమోదం తెలిపారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్పీకర్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, భట్టివిక్రమార్క, జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారని, ప్రతిపక్షాలు లేకుండా సభను టీఆర్ఎస్ మాత్రమే నిర్వహించుకోవాలని చూస్తోందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: