జబర్దస్త్ షోలో పంచుల ప్రవాహం గురించి మాట్లాడితే ముందు హైపర్ ఆది గురించి మాట్లాడాల్సి వస్తుంది. హైపర్ ఆదిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకే జబర్దస్త్ షో వచ్చింది అన్న రేంజ్ లో మనోడి పంచులు ఉంటాయి. అదిరే అభి టీం లో ఒక కంటెస్టంట్ గా చేరి ఇవాళ స్టార్ అయ్యాడు అంటే హైపర్ ఆది టాలెంట్ మెచ్చుకోవాల్సిందే. కొన్నాళ్ళుగా జబర్దస్త్ లో ఆది హవా కొనసాగుతుంది. అతనికి చెక్ పెట్టే ప్రయత్నాలు ఎవరు చేయలేదు. అయితే లేటెస్ట్ గా ఓ కొత్త కుర్రాడు ఆ పని మీద ఉన్నట్టు తెలుస్తుంది.

 

జబర్దస్త్ అంటే హైపర్ ఆది అన్న టాక్ ను చేరిపెసేందుకు కొత్తగా వచ్చిన కుర్రాడు ఇమ్మాన్యుయెల్ అదరగొట్టేస్తున్నాడు. వెంకీ మంకీస్ స్కిట్ లో కనిపించే ఇమ్మాన్యుయెల్ టైమింగ్ బాగుందని మిగతా వాళ్ళు వాడేస్తున్నారు. తన టైమింగ్.. పంచ్.. ఇలా అన్ని అబ్సర్వ్ చేస్తే జబర్దస్త్ లో ఇమ్మాన్యుయెల్ కొన్నాళ్ళు ఉండేలా ఉన్నాడు. అంతేకాదు ఏడాది తర్వాత ఆటను సొంత టీం ఏర్పరచుకునేలా ఉన్నాడు. ఇప్పటికే ఇమ్మాన్యుయెల్ ఉన్నాడా అయితే స్కిట్ సూపర్ అన్నట్టు టాక్ వచ్చింది. అతను కూడా వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ మంచి టైమింగ్ తో కామెడీ చేస్తున్నాడు.

 

హైపర్ ఆది కూడా మొదట్లో ఇలానే చురుగ్గా పనిచేసి ఆ తర్వాత సోలోగా కుమ్మేస్తూ వచ్చాడు. ఇమ్మాన్యుయెల్ కూడా ఈమధ్యనే జబర్దస్త్ లోకి వచ్చి అప్పుడే అందరికి ఫేవరేట్ అయ్యాడు. ఇమ్మాన్యుయెల్ పటాస్ షో ద్వారా పరిచయమై అతనిలోని టైమింగ్ చూసి జబర్దస్త్ ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని అతను బాగా వాడుకుంటున్నాడు. తక్కువ టైంలో ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఇమ్మాన్యుయెల్ రానున్న రోజుల్లో మరింత సత్తా చాతుటాడని చెప్పొచ్చు. కచ్చితంగా ఇమ్మాన్యుయెల్ కు మంచి ఫ్యూచర్ ఉండేలా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: