టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు రాఘవేంద్ర రావు గురించి అందరికీ తెలుసు. అయితే గతంలో అతని పై ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎన్నో విమర్శలు చేశాడు. రాఘవేంద్రరావు ని ఒక సంస్కారహీనుడు అని, అతనికి అనవసరంగా డాక్టరేట్ ఇచ్చారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను మరెవరో కాదు సీతారామ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం గోరింటాకు, నారీ నారీ నడుమ మురారి లాంటి డీసెంట్ మూవీలను నిర్మించిన కాట్రగడ్డ మురారి.



ఐతే 1982వ సంవత్సరంలో కాట్రగడ్డ మురారి త్రిశూలం అనే సినిమాని నిర్మిస్తుండగా... ఆ చిత్రానికి కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్నాడు. కృష్ణంరాజు, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా జయసుధ, రాధిక కీలకపాత్రలో నటిస్తున్నారు. ఐతే ఒకానొక రోజు ఈ చిత్రంలోని ఒక పాట యొక్క షూటింగ్ ఊటీలో జరుగుతుంది. ఆ పాట చిత్రీకరణలో భాగంగా దర్శకుడు కె.రాఘవేంద్ర రావు ఓ షాట్ తీస్తూ 'హీరో అలా వస్తాడు. నువ్వు ఇలా చీర విప్పాలి', అని శ్రీ దేవి తో చెబుతాడు. రాఘవేంద్ర రావు తన సినిమాలోని  హీరోయిన్లతో ఎక్సపోజ్ చేయించడం సాధారణమే అని భావించిన శ్రీదేవి వెంటనే తన చీర విప్పడం ఆరంభిస్తుంది. అయితే దూరంగా కూర్చుని పాట చిత్రీకరణను చూస్తున్న నిర్మాత పరుగుపరుగున శ్రీదేవి వద్దకు వచ్చి 'ఆయన షాట్ చెప్పడం ఏంటీ? నువ్వు ఓకే చెప్పేయడం ఏంటమ్మా? ఇలాంటివి అస్సలు చేయకు', అని చెప్పేశారు.

 



దీంతో ఆగ్రహించిన కె.రాఘవేంద్రరావు 'మురారి, గారు ఏంటిది? డైరెక్టర్ గా నేను ఆమెను చీర విప్పమని చెప్పాను. దానికి ఆమె అంగీకరించి చేసేస్తుంది. మధ్యలో మీకేంటి సమస్య?' అని కాట్రగడ్డ మురారి ని అడుగుతాడు.



దాంతో కాట్రగడ్డ మురారి స్పందిస్తూ... ' ఈ సినిమాకి నేను నిర్మాతని. సీతామాలక్ష్మి లాంటి మంచి సినిమాలను తీసినటువంటి వాడిని. నా సినిమాలో ఇటువంటి అడల్ట్ సన్నివేశాలు ఉండడానికి వీలులేదు', అని కాస్త ఘాటుగా చెప్పేశారు.



అవమానంగా భావించిన కే రాఘవేంద్ర రావు...'సర్లే కానీ శ్రీ దేవి నీ పైట జారిపోకుండా ఒక డజన్ పిన్నీసులను నీ చీరకు పెట్టుకో', అని అన్నాడట. ఈ విషయాన్ని కాట్రవల్లి మురారి తను రాసిన నవ్విపోదురుగాక పుస్తకంలో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: