100కోట్లు. ప్రతీ స్టార్ హీరో లక్ష్యం ఇది. ఈ మార్క్ దాటడం అంత ఈజీ కాదు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసిినా.. ఈ క్లబ్ లో చేరని స్టార్స్ చాలా మంది ఉన్నారు. 100కోట్ల మార్క్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న హీరోలో ఎవరో తెలుసా.. 

 

100కోట్ల మార్క్ ఓ ఛాలెంజ్ అయితే.. ప్రభాస్ కు అది చాలా సింపుల్. పెద్దగా కష్టపడకుండా.. ఈజీగా 100కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. రాజమౌళి ఆశీస్సులతో బాహుబలితో ఒకసారి.. బాహుబలి 2తో మరోసారి దాటేశాడు.

 

బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా హీరో అయిపోయిన ప్రభాస్ కు వంద కోట్లంటే వెన్నతో పెట్టిన విద్యలా మారిపోయింది. సాహో సినిమా ఫ్లాప్ అయినా.. హిందీలో ఓ వంద.. తెలుగులో మరో వంద కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం నటిస్తున్న మూవీ అలవోకగా 200కోట్లు దాటేయడం గ్యారెంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. 

 

నిన్నటి వరకు 100కోట్లంటే.. అమ్మో అన్న ఫీలింగ్ లో ఉన్న బన్నీ ఉన్నాడు. కెరీర్ లో బిగ్గిస్ట్ హిట్ గా నిలిచిన సరైనోడు 76కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. 100కోట్లపై ఆశలు వదిలేసుకుంటున్న టైమ్ లో అల వైకుంఠపురములో 150కోట్లు పైగా తీసుకొచ్చింది. దీంతో వందకోట్ల మార్క్ కోరిక తీర్చేసుకున్నాడు స్టైలిష్ స్టార్. 

 

100కోట్లు దాటిన మరో హీరో మహేశ్. శ్రీమంతుడు.. భరత్ అనే నేనుతో 90కోట్ల దాకా వచ్చాడు. మహర్షి మూవీతో బొఠాబొటిన 100కోట్లతో అడుగుపెట్టి.. సరిలేరు నీకెవ్వరుతో రెండోసారి 100కోట్లు టచ్ చేశాడు మహేశ్.

 

హీరోగా ఎంట్రీ ఇచ్చిన రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన రామ్ చరణ్ 100కోట్ల కోసం ఎక్కువ టైమే తీసుకున్నాడు. రంగస్థలంతో 120కోట్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తాచాటాడు.  

 

ఇప్పటి వరకు ప్రభాస్ మహేశ్.. బన్నీ.. రామ్ చరణ్ మాత్రమే 100కోట్ల మార్క్ దాటారు. దీన్ని అందుకోవాల్సిన హీరోలు ఇద్దరే ఉన్నారు. ఈ రేసులో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ పరుగెడుతున్నారు. ఎవరు ఏ సినిమాతో 100కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందో అనే విషయం ఫ్యాన్స్ లో ఉత్కంఠగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: