మామూలుగా అయితే స్టార్ హీరోలు తమకి ఇష్టమైన రంగంలో పెట్టుబడులు పెడుతూ అక్కడ కూడా సంపాదన ఆర్జిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా చాలామంది సైడ్ బిజినెస్ నడుపుతూ ఎంతగానో సంపాదిస్తున్నారు. ఇలా సంపాదిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నారు. మెగా పవర్ స్టార్ కి హార్స్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం రామ్ చరణ్ కి మాత్రమే కాదు మెగా ఫ్యామిలీకి హార్స్ రైడింగ్ కి ఏదో సంబంధం ఉన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన అందరు హీరోలు హార్స్ రైడింగ్ వచ్చిన వాళ్లే ఉన్నారు. 

 

 

అంతేకాకుండా చాలా మంది హీరోలు తమ సినిమాల్లో ఎక్కువగా హార్స్ రైడింగ్ గురించి కూడా చెబుతూ ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే రామ్ చరణ్ టాలీవుడ్ లో టాప్ హీరోగా దూసుకుపోతునే  మరోవైపు ఓ నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారన్న  విషయం తెలిసింది. మెగా ఫ్యామిలీకి నిర్మాణ సంస్థలు అంతగా అచ్చిరావు అని ఉన్న  సెంటిమెంట్ ను  చెల్లా చెదురు చేస్తూ నిర్మాతగా కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు  రామ్ చరణ్. అంతే కాకుండా రామ్ చరణ్ కి హార్స్ రైడింగ్  లో బెట్టింగ్ చేయడం కూడా చాలా ఇష్టమట. 

 

 

 హార్స్ రైడింగ్ చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సాధారణంగానే  హార్స్ రైడింగ్ అంటే ఇష్టపడే రామ్ చరణ్... ఇక హార్స్ రేసింగ్ పోటీలలో కూడా పెట్టుబడులు పెడుతూ ఉంటారట. ఇలా బాగానే డబ్బులు సంపాదిస్తూ ఉంటారట రామ్ చరణ్. ఏదేమైనా ఓవైపు హీరోగా అదరగొడుతుne మరోవైపు సైడ్ బిజినెస్ లో కూడా తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నారు మెగాపవర్ స్టార్  రామ్ చరణ్. మెగా ఫ్యామిలీ లో ఎవరికీ అచ్చిరాని నిర్మాణ రంగంలో దూసుకుపోతునే  మరోవైపు హార్స్ రైడింగ్ లో కూడా బెట్టింగ్ పెడుతూ అంతకుమించి అనే లాగానే బిజినెస్మేన్ గా  దూసుకుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: