సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు.. గౌతమ్ మీనన్ డైరక్షన్ లో వచ్చిన ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా ఈ చెన్నై చిన్నది అప్పటి నుండి ప్రేక్షకులను మాయ చేస్తూనే ఉంది. జోష్ సినిమాతో నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య కెరియర్ లో మొదటి కమర్షియల్ హిట్ సినిమా ఏమాయ చేసావే. సినిమాలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా యూత్ ఆడియెన్స్ ను మెప్పించింది. మొదటి సినిమానే అయినా సమంత తన నటనతో ఆడియెన్స్ ను మంత్రముగ్దుల్ని  చేసింది. ఆ సినిమా నుండి ఇప్పటివరకు సమంత వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. 


పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ కు అయినా ఆఫర్లు తగ్గుతాయి కానీ సమంత మాత్రం ఆఫ్టర్ మ్యారేజ్ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా సినిమాలు చేస్తుంది. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఇప్పుడు సమంత బెస్ట్ ఆప్షన్ అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో 44 సినిమాల దాకా చేసిన సమంత మొదటి సినిమా నుండి అభినయ తారగా ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చింది. సమంత సినిమాలో ఉంది అంటే సినిమా హిట్టే అన్న సెంటిమెంట్ ఏర్పడేలా చేసుకుంది. ఇక అక్కినేని ఇంట కోడలుగా మారిన తర్వాత కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది సమంత. 


మనలో టాలెంట్ ఉండాలే కానీ కెరియర్ కు పెళ్లి ఏమాత్రం అడ్డు కాదు అని ప్రూవ్ చేసింది సమంత. పెళ్లి తర్వాత వెరైటీ సినిమాలు చేస్తూ ఆమె ఎంతోమంది హీరోయిన్స్ కు ఆదర్శంగా నిలుస్తుంది. సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ సూపర్ హిట్ ఫేమ్ కొనసాగిస్తున్న సమంత ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది. ప్రేక్షకులను అలరిస్తూ ఇలాంటి బర్త్ డేలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం.              

మరింత సమాచారం తెలుసుకోండి: