టాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా చేసి.. ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్ నవనీత్ కౌర్. ఈ అమ్మడు అందాలకు అప్పుడు కుర్ర కారు బలే గంతులేశారు అంతగా ఆకట్టుకున్న ఈ అమ్మడు కెరియర్ మాత్రం సక్సెస్ చేసుకోలేక పోయింది. అందుకే సినిమాలు వదిలేసిన బుల్లి తెర రియాల్టి షోల ద్వారా ఆడియెన్స్ ని అలరించింది. ఇక ఈ పాప ఓ కేస్ లో ఇర్రుకుందట. అది అలాంటి ఇలాంటి కేస్ కాదు రాంగ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ని పుట్టించిన కేస్ లో ఇరుక్కుంది.
అసలు ఏమైంది నవనీత్ ఎందుకిలా చేసింది అని విచారణలోకి వెళ్తే.. ఎపిహెరాల్డ్.కామ్ కి అందిన సమాచారం ఏంటంటే.. నవ నీత్ 2011 లో మహారాష్ట్ర లోని అమరావతి ఎంపి రావి రాణా ని పెళ్ళిచేసుకుంది. అయితే ఇప్పుడు అదే అమరావతి ఎంపి స్థానానికి నవనీత్ ఎన్.సి.పి పార్టి తరపున టికెట్ సంపాధించింది. నిజానికి అది ఒక షెడ్యూల్ కులానికి సంబంధించిన టికెట్ అట. దానికి ఆమెకు ఎంపి టికెట్ ఇవ్వడంతో యెవ్వారం ఇక్కడ దాకా వచ్చింది.
అసలు నవనీత్ షెడ్యూల్ కులానికి సంబంధించినది కాకపోయినా తను ఎస్.సి అని సర్టిఫికేట్ ని పుట్టించిందట . ఈ విషయం తెలుసుకున్న మెట్రోపాలిటన్ కోర్ట్ వారు తన మీద ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేశారట. ఫేక్ సర్టిఫికేట్ సాధించి ఎంపి టికెట్ సాధించిన నవనీత్ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. మరి ముంబై పోలీసులు ఈ విషయంపై ఏ విధంగా ఆమె మీద రియాక్షన్ తీసుకుంటారో చూద్దాం.
నవ్ నీత్ ఎంపి టికెట్ వివాదంపై మీ స్పందన..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి