తేజ డైరక్షన్ లో వచ్చిన జై సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నవదీప్. కెరియర్ మొదట్లో హీరోగా ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో సైలెంట్ అయ్యాడు. ఇక అడపాదడపా చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకుంటున్న ఈ హీరోకి ఓటిటి వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ అదృష్టంగా మారాయి. కొద్దిగా ఫామ్ లో ఉన్న యువ హీరోలంతా సినిమాలు చేస్తుండగా వెబ్ సీరీస్ ల కోసం అందరు నవదీప్ ను అడుగుతున్నారు. ముఖ్యానంగా తెలుగు ఓటిటి యాప్ ఆహా కోసం నవదీప్ కు భారీ మొత్తం ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. 

 

కేవలం నవదీప్ మాత్రమే ఎందుకు అంటే.. ఇండస్ట్రీలో అతనికి ప్లే బోయ్ ఇమేజ్ ఉంది. ఎలాంటి పాత్ర అయినా చేస్తా అని హింట్ ఇవ్వడంతో నవదీప్ తో వరుస వెబ్ సీరీస్ లు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆహాలో మస్తిస్ రిలీజై సక్సెస్ అవగా లేటెస్ట్ గా రన్ అంటూ వెబ్ మూవీతో వచ్చాడు నవదీప్. ఈ సినిమాలో కూడా నవదీప్ తన నటనతో మెప్పించాడు. తెలుగులో ఓటిటి కోసం వెబ్ హీరో అనగానే ముందు నవదీప్ పేరు రిఫర్ చేస్తున్నారు. అతనైతే అనుకున్న బడ్జెట్ లో అనుకున్న ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చని మేకర్స్ ప్లాన్. 

 

హీరోగా వెండితెర మీద సక్సెస్ అవలేని నవదీప్ వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ లతో మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఎలాగైతేనేం ప్రేక్షకులకు దగ్గరవ్వడమేగా కావాల్సింది అనుకుంటున్నాడు నవదీప్. ఈమధ్యలోనే అతని డిమాండ్ కూడా పెరగడంతో రెమ్యునరేషన్ కూడా పెంచాడని అంటున్నారు. మొత్తానికి నవదీప్ కెరియర్ ఓటిటిల ద్వారా సూపర్ సక్సెస్ ఫుల్ గా నడుస్తుందని చెప్పొచ్చు. ఇవే కాదు ప్రస్తుతం షూటింగ్ మధ్యలో ఉన్న వెబ్ సీరీస్, మూవీస్ కూడా చాలా ఉన్నాయని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: