సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో పలు ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్స్ చేశారు. తాజాగా `ఎఫ్ 2`లోనూ తన మార్క్ కామెడీతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళారు. అలాగే f2 సినిమా ఘనవిజయంలో ముఖ్య భూమిక పోషించారు మన వెంకీ. ఇక… హాస్యభరిత పాత్రల పరంగా వెంకీ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే పాత్రల్లో F2 సినిమా ఒకటి. ఇక ఈ చిత్రాన్ని మొత్తం వెంకీ తన నటనతో వన్ మ్యాన్ షో అనిపించి, నడిపించాడు. ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ చూస్తే ఎప్పుడో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలు మరలా మన కళ్ల ముందు మెదులుతుంటాయి.
దాంతో మనకి చాలా కాలం తర్వాత పాత వెంకీ కనిపించాడు అని అనిపిస్తుంది. ముఖ్యంగా వెంకటేష్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి కామెడీ కోరుకుంటున్నారో ఈ సినిమాలో ఆ టైపు కామెడీ బాగానే వర్కౌట్ అయింది. వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్‌గా నిలిచారు. ఈ సినిమాలో పెళ్లి తర్వాత ఫ్రస్ట్రేషన్‌కి గురి అయ్యే సన్నివేశాల్లో గాని, వరుణ్‌తేజ్‌తో సాగే సన్నివేశాల్లో గాని, అలాగే క్లైమాక్స్ సీన్స్ లోగాని తనలోని కామెడీ యాంగిల్స్ తో, తన మాడ్యులేషన్‌తో వెంకీ బాగా అలరిస్తారు. ఈ చిత్రానికి వెంకీ నటన ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమాలో వెంకీ లుక్ కూడా బాగుంటుంది. ఈ తరంలో కూడా క్లాస్-మాస్ అని తేడా లేకుండా అందరినీ అలరించేలా కామెడీ పండించడంలో తాను ముందుంటానని వెంకటేష్ మరోసారి చాటి చెప్పాడు.
కామెడీ విషయంలో వెంకీకి తిరుగులేదన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.F2 సినిమాలో భార్యాబాధితుడిగా అతను చెలరేగిపోయి నటించాడు. ప్రథమార్థంలో ఇలా ప్రేక్షకుల కడుపు చెక్కలు చేసే సీన్లు చాలానే ఉన్నాయి. పెళ్లిచూపుల టైంలో వెంకీ చూపించే అత్యుత్సాహం భలేగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఆ తర్వాత ఇదే తరహాలో సాగే వరుణ్ పెళ్లిచూపుల సన్నివేశాన్ని మరింత హిలేరియస్‌గా డీల్ చేశాడు వెంకటేష్. ఇప్పటికి మనం ఆ సీన్స్ చూస్తే నవ్వు ఆపుకోలేము. ఈ సినిమాలో వెంకటేష్ చెప్పే "అంతేగా... అంతేగా "డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఆ డైలాగ్ వింటే చాలు టక్కున వెంకీ గుర్తొస్తాడు.అలాగే ఓల్డ్ ఏజ్ బామ్మలు, వెంకటేష్ మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.వెంకటేష్ చేసే కామెడీ కోసం అయినా సరే ఈ సినిమాను మళ్ళీ చూడాలనిపిస్తుంది అందరికి. అంతలా నవ్వించాడు మన విక్టరీ వెంకటేష్...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి