టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి దశాబ్ధం పైగా అవుతున్నా సరే ఇప్పటికి మిల్కీ బ్యూటీ తమన్నాకి సూపర్ ఛాన్సులు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ f-2తో హిట్ అందుకున్న ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి సినిమాలో మంచి పాత్ర చేసింది. ఇక ఈ ఇయర్ మొదట్లో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెప్పించింది తమన్నా. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా నటిస్తున్న సీటిమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అమ్మడు లేటెస్ట్ గా ఓ కన్నడ రీమేక్ లో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

 

కన్నడలో సూపర్ హిట్ అయిన లవ్ మాక్ టైల్ సినిమా తెలుగు రీమేక్ లో తమన్నా హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. నూతన దర్శకుడు నాగ శేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో  సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. యువ హీరోలతో కూడా నటించేందుకు తమన్నా నో చెప్పలేదు. అయితే ఈ సినిమాలో నటించేందుకు మాత్రం అమ్మడు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. మాములుగా సినిమాకు కోటి నుండి కోటిన్నర దాకా తీసుకునే తమన్నారీమేక్ కు మాత్రం రెండున్నర కోట్లు రెమ్యునరేషన్ అడిగి నిర్మాతలకు షాక్ ఇచ్చిందట. 

 

తమన్నా అంత అడిగినా సరే ఆమె డిమాండ్ చేసినంత ఇచ్చి ఆమెనే హీరోయిన్ గా ఫైనల్ చేశారని తెలుస్తుంది. తమన్నా సినిమాలో ఉంటే అటు అభినయంతో పాటుగా గ్లామర్ షో కూడా భారీగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే తమన్నా అడిగినంత ఇచ్చేసి ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారట. ప్రస్తుతం తమన్నా నటించిన దట్ ఈజ్ మహాలక్ష్మి ఓటిటి రిలీజ్ ప్లానింగ్ లో ఉంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ కు రీమేక్ గా నటించిన దట్ ఈజ్ మహాలక్ష్మి సినిమా ఇప్పటికి రిలీజ్ కు నోచుకోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: