టాలీవుడ్ స్టార్స్ లో నవరసాలను పండించగలిగే ఏకైక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనడంలో సందేహం లేదు. మిగతా స్టార్స్ ఏమి తక్కువ కాదు కాని ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో పౌరాణిక పాత్రల్లో మెప్పించాలంటే అది ఒక్క తారక రాముడి వల్లే అవుతుంది. బాలరామాయణం సినిమాతో బాలనటుడిగానే ప్రేక్షకుల మెప్పు పొందిన ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారి స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ తో సినిమా చేసిన ప్రతి డైరక్టర్ చెప్పే మాట ఒక్కటే.. ఎన్టీఆర్ హీరో కాదు నటుడు అని.
తమకు కావాల్సిన అవుట్ పుట్ ను అతని నుండి తీసుకోవచ్చని అంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి డైర్క్షన్ లో rrr సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు తారక్. సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటిస్తున్నారని తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ ఇప్పటికే టీజర్ తో అదరహో అనిపించాడు. ఇక రావాల్సింది కొమరం భీమ్ టీజరే. ఈ టీజర్ ను స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట ట్రిపుల్ ఆర్ టీం.
ఇక సినిమాలో చరణ్, తారక్ ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా నట విశ్వరూపం చూపించాడట. ఎన్టీఆర్ నటనతో నందమూరి ఫ్యాన్స్ కే కాదు సిని ప్రియులకు పిచ్చెక్కిపోవాల్సిందే అని తెలుస్తుంది. చరణ్ అల్లూరి టీజర్ తోనే సినిమా అంచనాలకు మించి ఉంటుందని రుచి చూపించిన రాజమౌళి తారక్ టీజర్ తో సినిమాపై మరింత భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తాడని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి