మెగాస్టార్ పక్కన అవకాశమంటే ఎగిరి గంతేస్తారు హీరోయిన్లు. చిరంజీవి ప్రియురాలిగా ప్రేక్షకులు గుర్తుంచుకున్నా, లేకపోయినా.. తర్వాత మెగా ఫ్యామిలీ సినిమాల్లో ప్రాముఖ్యత ఉంటుందనే విషయం వాస్తవం. ఎలాగూ పాన్ ఇండియా సినిమానే తీస్తారు కాబట్టి ఇతర భాషల్లో కూడా క్రేజ్ తెచ్చుకోవచ్చని ఆలోచిస్తారు. కానీ త్రిష ఎందుకో ఈ లెక్క మిస్సైంది. ఆచార్య సినిమాలో తనకు తానే అవకాశాన్ని కాలదన్నుకుంది. తన పాత్ర నచ్చలేదని సైలెంట్ గా బైటకొచ్చేసింది. 

అప్పటికి త్రిష చేతిలో తమిళ, మలయాళ చిత్రాలు ఉన్నాయి. కట్ చేస్తే కరోనా వచ్చింది. ఎక్కడి షూటింగ్ లు అక్కడ ఆగిపోయాయి. త్రిష ఒప్పుకున్న తమిళ సినిమాల భవిష్యత్తు డైలమాలో పడింది. ఇటు చూస్తే ఆచార్య మూవీలో త్రిష ప్లేస్ లో కాజల్ ఫిక్స్ అయింది. కరోనా ప్రభావంతో ఏ సినిమాలు ఆగిపోతాయో, ఏవి తిరిగి మొదలవుతాయో తెలియని పరిస్థితి. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్ ల వైపు చూస్తోంది త్రిష. అయితే అనుకోకుండా త్రిష ఇంటి తలుపు తట్టాడు ఆచార్య. ఆచార్య సినిమాని అనవసరంగా వదులుకున్నానని, ఇప్పుడు చేతిలో సినిమాలు లేకుండా పోయాయని వాపోతున్న త్రిషకు.. ఆచార్య టీమ్ నుంచి మరోసారి కాల్ వచ్చింది. అయితే ఈ సారి ఐటమ్ సాంగ్ కోసం ఆమెను సంప్రదించారని సమాచారం. 

కరోనా వల్ల మిగతా అన్ని సినిమాల్లాగే  ప్రస్తుతం ఆచార్య షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా పక్కాగా పూర్తి చేసుకుంటున్నట్టు సమాచారం. మణిశర్మ సంగీతాన్నందిస్తున్న ఈ సినిమాలో మాంచి ఐటంసాంగ్ కూడా ఉందట. ఈ సాంగ్ సినిమాకి హైలెట్ అవుతుందని అంటున్నారు. మ్యూజిక్ పరంగానే కాకుండా.. డ్యాన్స్ పరంగా కూడా ఈ పాట హైలెట్ కావాలని చూస్తున్నారు. అందుకే చిరు పక్కన మరో క్రేజీ హీరోయిన్ తో స్టెప్పులేయించాలని అనుకుంటున్న చిత్ర బృందం అనుకోకుండా మళ్లీ త్రిషకే ఆఫర్ ఇచ్చింది. ఆచార్య ఐటమ్ సాంగ్ కోసం త్రిషతోపాటు రెజీనా, తమన్నా కూడా లైన్లో ఉన్నారట. అయితే హీరోయిన్ ఛాన్స్ మిస్ అయిన త్రిషకు ఫస్ట్ ఆఫర్ ఇవ్వాలనుకుందట సినిమా యూనిట్. గతంలో హీరోయిన్ ఆఫర్ వదిలేసి తప్పు చేసిన త్రిష ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకునేలా కనిపించట్లేదు. చిరు పక్కన ఐటంసాంగా లో స్టెప్పులేయడానికి త్రిష దాదాపుగా అంగీకరించిందని సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: