అందరిలానే చేసినా అందరు పాపులర్ అవలేరు. ఇంతకీ ఇందాక నుండి దుర్గా రావు.. దుర్గా రావని చెప్పి విసిగిస్తున్నా అనుకోవద్దు. వెస్ట్ గోదావరికి చెందిన దుర్గా రావు తన టిక్ టాక్ వీడియోలతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆయనలో ఏదో స్పెషల్ క్వాలిటీ ఉందని అనుకుంటే పొరపడినట్టే. డ్యాన్స్ రాదు కాని చేస్తాడు.. డైలాగ్ చెప్పలేడు కాని చెబుతాడు. తన వీడియోలు చూసి ఎలాంటి అసభ్యకరమైన కామెంట్లు పెట్టినా తను మాత్రం పట్టువదలని విక్రమార్కునిలా టిక్ టాక్ చేస్తూనే ఉన్నాడు.
అతన్ని చూసి మొదట్లో బాబోయ్ అనుకున్న వారే ఈరోజు దుర్గా రావు ఎలాంటి భయకరమైన డ్యాన్స్ వేసి నవ్విస్తాడో అన్న రేంజ్ కు వెళ్ళాడు. అలా పాపులర్ అయిన దుర్గా రావు జబర్దస్త్, ఢీ టీం లకు టచ్ అయ్యాడు. ఢీ లో రీసెంట్ ఎపిసోడ్ లో పండు వేసిన నక్కిలీసు గొలుసు సాంగ్ లో నీకు దుర్గా రావు తెలుసా.. అంటూ ఓ లిరిక్ యాడ్ చేశారంటే మనోడి క్రేజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు జబర్దస్త్ షోలో కూడా ఆది టీంలో ఓ స్కిట్ లో ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి దుర్గారావు ఫ్రమ్ టిక్ టాక్ టూ జబర్దస్త్ భలే ఫేమస్ అయ్యాడులేండి. బుధవారం ఎపిసోడ్ లో పండు డ్యాన్స్ షో చూశాక దుర్గా రావు గురించి తెలియని వారు కూడా తెలుసుకోవాలని వెతికేస్తున్నారు. ఒకరి కామెంట్స్ తో సంబంధం లేకుండా మనం చేయాల్సింది చేసుకుంటూ పొతే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయని దుర్గా రావు ద్వారా మరోసారి ప్రూవ్ అయ్యింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి