టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్. పెదనాన్న కృష్ణంరాజు నట వారసుడిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్, ఆ తర్వాత శోభన్ దర్శకత్వంలో వచ్చిన వర్షం సినిమాతో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ ను అందుకున్నారు. అనంతరం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చత్రపతి సినిమాతో మరొక విజయం అందుకున్న ప్రభాస్ అక్కడి నుండి వరుసగా అవకాశాలు తో ముందుకు సాగారు. ఇటీవల దర్శక దిగ్గజం రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాల సినిమాల విజయాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో హీరోగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు అందుకోవటంతో పాటు తన మార్కెట్ వాల్యూని కూడా అమాంతం పెంచుకున్నారు.  

ఇక ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే యాక్షన్ లవ్ స్టోరీ మూవీ లో నటిస్తున్న ప్రభాస్, దాని అనంతరం మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో భారీ లెవల్లో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో హీరోగా నటించనున్నారు. అయితే లేటెస్ట్ గా ప్రభాస్ విషయమై ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాలలో విస్తృతంగా ప్రచారమవుతోంది. కొన్నాళ్లుగా టాలీవుడ్ తో పాటు పలువురు బాలీవుడ్ దర్శకులు ప్రభాస్ డేట్స్ కోసం ఆయన ఇంటికి వస్తూ పోతూ ఉన్నారని, ఆయన కూడా ఒకింత ఎక్కువగా వారికే ప్రాధాన్యతనిస్తున్నారని అంటున్నారు.  

బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ రేంజ్ బాలీవుడ్ హీరోల స్థాయికి పెరిగిపోవడంతో ఇక రాబోయే రోజుల్లో ఆయన ఎక్కువ శాతం బాలీవుడ్ సినిమాలు చేసే అవకాశం కూడా లేకపోలేదని కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న తరుణంలో, లేటెస్ట్ గా ప్రభాస్ బాలీవుడ్ వారికే ప్రాధాన్యతనిస్తున్నారు అనే వార్త కూడా ప్రచారం అవుతుండడంతో, ఆయన ఇక పై ఎక్కువగా వారి సినిమాల్లోనే నటిస్తారా అంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై పలువురు ప్రభాస్ సన్నిహితులు మాత్రం మరోవిధంగా చెపుతున్నారట. కొన్నాళ్లుగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రభాస్ ఇంటికి వస్తున్న మాట నిజమే అని, అయితే ప్రభాస్ మాత్రం వారి సినిమాలతో పాటు టాలీవుడ్ సినిమాలను కూడా బ్యాలెన్స్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెపుతున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగవలసిందే అంటున్నారు విశ్లేషకులు ....!!

మరింత సమాచారం తెలుసుకోండి: