ఇక ఆ తరాత వచ్చిన నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో అలరించినా ఆ సినిమా కూడా నిరాశపరచింది. ఇక అప్పటి నుండి అమ్మడికి ఛాన్సులు రాలేదు. తెలుగులోనే కాదు తమిళ, మళయాళ భాషల్లో కూడా అను ఛాన్సులు అందుకోలేదు. మంచి ఫాంలో ఉన్నప్పుడు 50 నుండి 75 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు 30 నుండి 40 లక్షలు ఇచ్చినా చాలని అంటుందట. అంతేకాదు ఈసారి ఆఫర్ అంటూ వస్తే తన అసలు టాలెంట్ చూపిస్తా అంటుంది.
ఎలాగు సినిమా ఛాన్సులు రావట్లేదని ఆహా కోసం ఓ వెబ్ సీరీస్ కు ఓకే చెప్పిందట అమ్మడు. ఈ వెబ్ సీరీస్ కోసం అమ్మడు హాట్ గా కనిపించనుందని తెలుస్తుంది. ఒక ఎపిసోడ్ కు కేవలం 2 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. మెగా ఆఫర్స్ తో టాప్ రేంజ్ కు వెళ్తుందని భావించిన అను ఇలా రెమ్యునరేషన్ సగానికి పడిపోయి ఆఫర్లు రాక కెరియర్ సంక్షోభంలో పడుతుందని ఎవరు ఊహించి ఉండరు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి