తెలుగు అమ్మాయే అయినా బాలీవుడ్ నీళ్లు బాగా పడిన అదితి రావు హైదరి తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. తెలుగులో ఆమె చేసిన సమ్మోహనం, అంతరిక్షం ప్రేక్షకులను అలరించగా లేటెస్ట్ గా నాని వి లో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. సినిమాలో ఎక్కువ కనిపించిన నివేదా థామస్ కన్నా నిడివి తక్కువ ఉన్నా అదితి రావు హైదరి పాత్ర చాలా బాగా వర్క్ అవుట్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే ఆ ఎపిసోడ్స్ కూడా ఊహించిన రేంజ్ లో లేకపోయినా అదితి తన పార్ట్ వరకు బాగానే చేసిందని చెప్పొచ్చు.

సాహెబా పాత్రకు పూర్తి న్యాయం చేసిన అదితి తన వరకు లవ్ స్టోరీ సినిమాలంటేనే ఇష్టమని చెబుతుంది. తన దగ్గరకు వచ్చే కథల్లో లవ్ స్టోరీస్ అయితేనే ముందు వాటికే ప్రిఫరెన్స్ ఇస్తానని అంటుంది. ఇక ఈమధ్య అందరు హీరోయిన్స్ వెబ్ సీరీస్ బాట పడుతున్నారు. అయితే తనకు ఇప్పటివరకు వెబ్ సీరీస్ లో నటించాలన్న ఆలోచన రాలేదని తనని ఎక్సయిట్ చేసే పాత్ర వస్తే మాత్రం తప్పకుండా వెబ్ సీరీస్ చేస్తానని అంటుంది అదితి.

తెలుగులో వి సినిమా అంచనాలను అందకపోయినా సాహెబా పాత్రలో అదితి ఆడియెన్స్ ను మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో ఒక సినిమా తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పుకొచ్చారు అదితి రావు హైదరి. ఈ లాక్ డౌన్ టైం లో తాను ఓపిక గా ఉండటం.. పాజిటివ్ గా ఆలోచించడం విషయాలు ఇంకాస్త నేర్చుకున్నానని అన్నారు అదితి .                                                

మరింత సమాచారం తెలుసుకోండి: