సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ఇప్పటికి యువ కథానాయికలకు గట్టి పోటీ ఇస్తుంది. కమర్షియల్ సినిమాలు చేస్తూనే ప్రయోగాలకు ప్రాధాన్యత ఇస్తుంది అమ్మడు. 96 సినిమాతో మళ్ళీ తమిళంలో సూపర్ ఫామ్ లోకి వచ్చిన త్రిష హర్రర్ జానర్ సినిమాల మీద మోజు పెంచుకుందని తెలుస్తుంది. ఇప్పటికే త్రిష కూడా అలాంటి జానర్ సినిమాలు ఒకటి రెండు చేసింది అయితే అవి పెద్దగా మంచి ఫలితాలు ఇవ్వలేదు. అయితే త్రిష మాత్రం ఆ జానర్ లో హిట్టు కొట్టి తీరాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యింది.

లేటెస్ట్ గా నూతన దర్శకుడు దీపక్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యిందట త్రిష. హర్రర్ జానర్ తో మంచి స్క్రీన్ ప్లేతో సినిమా వస్తుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ స్టేట్మెంట్ రానుంది. త్రిష సినిమా అంటే తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుంది. అలా ఆమె చేసిన సినిమాను తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ చేయొచ్చు. అయితే ఫీమేల్ లీడ్ మూవీస్ గా ఇవి చేస్తూనే స్టార్ సినిమా ఆఫర్లు ఓకే చేస్తుంది త్రిష.

అయితే అమ్మడు తెలుగులో మాత్రం సినిమాలు చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ఆఫర్ వచ్చినా ఏదో కారణం వాళ్ళ ఆమె ఆ సినిమా నుండి తప్పుకుంది. రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకుంది అన్నారు కానీ ఆ సినిమా గురించి అప్డేట్ కూడా రావాల్సి ఉంది. తెలుగులో అమ్మడు చేస్తున్న సినిమాలేమో కానీ కోలీవుడ్ లో మాత్రం త్రిష వరుస సినిమాలు చేస్తుంది.

అక్కడ త్రిషకు క్రేజ్ అలానే కొనసాగుతుంది. కానీ తెలుగులో మాత్రం ఈమధ్య సినిమాలు చేయకపోవడంతో క్రేజ్ తగ్గిందని చెప్పొచ్చు. త్రిష హర్రర్ జానర్ అటెంప్ట్ ఈసారి అమ్మడికి సూపర్ హిట్ అందించాలని ఆశిస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: