దిల్ రాజుకే ఇంద్రగంటి మరో సినిమా చేసి పెట్టాలనే కమిట్మెంట్ ఉంది కాబట్టి.. ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలోనే ‘థాంక్యూ’ అనే చిత్రం చేస్తున్నాడు చైతన్య. దీనికి విక్రమ్ కుమార్ దర్శకుడు. ఇంద్రగంటితో చైతన్య సినిమా చెయ్యాలి అంటే మరో నిర్మాతతో చెయ్యాలి. చైతన్య సినిమాతో పాటు విజయ్ దేవరకొండతో కూడా సినిమా చేస్తున్నట్టు ఇంద్రగంటి ప్రకటించాడు. ‘మజిలీ’ నిర్మాత సాహు గారపాటి ఈ ప్రాజెక్టుని నిర్మిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.
అయితే విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ అనే పాన్ ఇండియా ప్రాజెక్టుని ఫినిష్ చేసుకుని రావాల్సి ఉంది.దాంతో ఇక్కడ కూడా ఇంద్రగంటి వెయిట్ చెయ్యాల్సిందే. కాబట్టి ఇంద్రగంటి…. చైతూ కోసం వెయిట్ చెయ్యడమే బెటర్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి.. ఈ యంగ్ డైరెక్టర్ చివరికి ఎవరితో ప్రాజెక్టు సెట్ చేసుకుంటాడో..!
ఇక నాగ చైతన్య శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న లవ్ స్టోరీ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఏషియన్ వారు ఈ సినిమాని మంచి ఫ్యాన్సీ రేటుకు కొనుక్కున్నారు. ఏకంగా 30 కోట్లకు కొనుక్కున్నారని టాక్ నడుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి