గతంలో ఈ డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించినప్పుడు.. ఆమెకు ఏ పాపం తెలియదని, అనవసరంగా ఆమె పేరు అందులో ఇరికించారని కొంతమంది భావించారు. సారీ రకుల్ అంటూ సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్ ఉద్యమాన్నే మొదలు పెట్టారు. రకుల్ కూడా తన పేరుతో వస్తున్న వార్తల్ని ఆపాల్సిందిగా మీడియా సంస్థలకు డైరక్షన్ ఇవ్వాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రకుల్ పేరు బైటకు రానే వచ్చింది, విచారణకు కూడా హాజరవుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సిినిమాలో నటిస్తోంది. మొన్నటివరకు ముంబయిలో ఉన్న రకుల్, మంగళవారమే హైదరాబాద్ వచ్చింది. బుధవారం క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంది. ఎన్సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) నోటీసులు ఇవ్వడంతో, విచారణకు హాజరయ్యేందుకు తిరిగి ముంబై వెళ్లిపోయింది. దీంతో క్రిష్ సినిమాకి బ్రేక్ పడింది.లాక్ డౌన్ తర్వాత క్రిష్ ఈ సినిమాని ఇటీవలే మొదలు పెట్టారు. హీరోయిన్ పోర్షన్ కూడా పెద్దగా సాగలేదు. ఈ నేపథ్యంలో హీరోయిన్ ని మార్చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు క్రిష్. వైష్ణవ్ తేజ్ హీరోగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు క్రిష్. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ అధికారులకు వివరాలు ఇచ్చేసి తిరిగొచ్చినా.. ఆమెతో షూటింగ్ కష్టంగానే ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అసలే కరోనా వల్ల షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు అన్నీ సిద్ధం చేసుకుని షూటింగ్ పెట్టుకుంటే హీరోయిన్ వెళ్లిపోయింది. దీంతో చిత్ర యూనిట్ డైలమాలో పడింది. క్రిష్ తన సినిమానుంచి రకుల్ ని తీసేస్తే.. మిగతా దర్శక నిర్మాతలు కూడా ఆమెతో సినిమా చేసే ధైర్యం చేయకపోవచ్చు. వివాదాలు, పోలీస్ కేసులలో చిక్కుకున్న హీరోయిన్లను ఎవరూ ఎంకరేజ్ చేయకపోవచ్చు. ఒకవేళ డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ తో బైటపడితే మాత్రం రకుల్ తన కెరీర్ కోసం మరింత కష్టపడాల్సి ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి