కొన్ని సినిమాల్లో కేవలం పాటలకే హీరోయిన్లు ఉంటారు. మరికొన్ని సినిమాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో హీరోయిన్లు నటిస్తారు. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో, ముఖ్యమైన పాత్రల్లో కొందరు హీరోయిన్లు పర్ఫెక్ట్ గా సరిపోతారు. అటువంటి వారు తెలుగులో ఎక్కువమంది హీరోయిన్లే ఉన్నారు. వారిలో అదితిరావ్ హైదరీ కూడా ఉంది. తెలుగులో అంతరిక్షం, సమ్మోహనం, వి.. సినిమాల్లో నటించి నటనలో తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఈ సినిమాలతో నటనకు అవకాశం ఉన్న పాత్రలకు అదితి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం ఓ కథా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో అదితి ఎంపికైంది.
ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే సినిమాను అనౌన్స్ చేశారు. సినిమాలో హీరోగా శర్వానంద్ ఎంపిక ఎప్పుడో జరిగింది. మరో హీరోగా తమిళ నటుడు సిద్ధార్ద్ నటిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా అదితిరావ్ హైదరీని ఎంపిక చేసింది టీమ్. ఈమేరకు అఫిషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది టీమ్. ఇంపార్టెంట్ క్యారెక్టర్ కు అదితిని ఎంపిక చేశాం. కథలో ఆమెది కీలకమైన పాత్ర అంటూ అదితి గురించి చెప్పుకొచ్చింది టీమ్.
త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడిగా అజయ్ భూపతికి ఆర్ ఎక్స్ 100 ద్వారా మంచి పేరు వచ్చింది. చేసింది ఒక్క సినిమానే అయినా ఇండస్ట్రీ అటెన్షన్ క్రియేట్ చేశాడు అజయ్. దీంతో మహా సముద్రం ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: