ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ కాబోతోంది. దీనికోసం రాజమౌళి భారీ కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈ టీజర్ రిలీజ్ తర్వాత మాత్రం కచ్చితంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరుగుతోందని అర్థమవుతోంది. ఎందుకంటే.. భీమ్ ఫర్ రామరాజు టీజర్ కంటే.. రామరాజు ఫర్ భీమ్ అనే టీజర్ మరింత హై ఓల్టేజ్ తో ఉంటుందట. ఈ టీజర్ వచ్చాక, రామ్ చరణ్ టీజర్ దానిముందు తేలిపోతుందని, అందుకే చరణ్ ఫ్యాన్స్ కాస్త నొచ్చుకుంటారని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోతారని టాలీవుడ్ వర్గాలంటున్నాయి.

రామరాజు ఫర్ భీమ్ పేరుతో విడుదల కాబోతున్న ఈ వీడియోలో ఎన్టీఆర్ ను పలు గెటప్ లలో రాజమౌళి చూపించబోతున్నారట. ఓ మామూలు మనిషి నుంచి ఉద్యమకారుడైన కొమరం భీమ్ గా మారిన వైనం చూపెట్టబోతున్నారు. అయితే ఈ స్టోరీనంతా చకచకా రకరకాల వేషాల్లో చూపిస్తారని తెలుస్తోంది. చివరిగా తలకు పాగా చుట్టుకున్న ఎన్టీఆర్ గెటప్ తో టీజర్ ముగుస్తుందట. టీజర్ మొదట్లో లాల్చీ తో కనిపించే ఎన్టీఆర్, టీజర్ చివర్లో తలపాగా చుట్టుకుని అలరిస్తారు. ఈ గెటప్ లు అన్నీ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకునేలా కట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఈసారి ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చే లేటెస్ట్ కంటెంట్ మరింత సెన్సేషన్ కావడం మాత్రం ఖాయం.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఇప్పటికి హీరో రామ్ చరణ్ పాత్రకు సంబంధించి వీడియో బయటకు వచ్చింది. దీనికి మంచి రెస్పాన్స్  వచ్చింది. దీనిలో ఎన్టీఆర్ వాయిస్ మరింత బాగుంది. ఇక ఎన్టీఆర్ ని పరిచయం చేసే టీజర్లో రామ్ చరణ్ వాయిస్ వినిపిస్తుంది. అసలే లాక్ డౌన్ వల్ల ఎన్టీఆర్ టీజర్ విడుదల కావడం ఆలస్యమైంది. దీంతో తారక్ ఫ్యాన్స్ గోలపెట్టేశారు. ఎప్పటికప్పుడు రాజమౌళిని ట్రోల్ చేశారు. అలా ట్రోల్ చేసినవారంతా శెహభాష్ అనేలా.. ఇప్పుడు టీజర్ కట్ చేస్తున్నారు జక్కన్న. లేటుగా వచ్చినా, లేటెస్ట్ గా ఈ టీజర్ ఉంటుందట. ముఖ్యంగా చరణ్ టీజర్ కంటే బాగుంటుందని, అందుకే ఇద్దరు హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో గొడవ మొదలవుతుందనే ఊహాగానాలున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: