ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... బాహుబలి-2 తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన 70 శాతం షూటింగ్ పూర్తి కాగా.. కరోనా కారణంగా మిగిలిన పార్ట్ వాయిదా పడింది. సుమారు ఏడు నెలల తర్వాత మళ్లీ తిరిగి షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రామ్ చరణ్ పాత్రకి సంబంధించిన టీజర్ ని వదిలారు. ఈ వీడియోకి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ రామ్ చరణ్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయనున్నారు. అక్టోబర్ 22న ఈ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికోసం కొద్దిరోజుల క్రితం ప్రత్యేకంగా షూటింగ్ మొదలుపెట్టారు. ఇంతకీ ఈ వీడియో ఎలా వుండబోతుందనే దానిపై ఆసక్తికర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలో ఎన్టీఆర్ ని పలు గెటప్పుల్లో చూపిస్తారని తెలుస్తోంది. ఓ మామూలు స్థాయి వ్యక్తి నుండి ఉద్యమకారుడైన కొమరం భీమ్ గా మరీనా వైనాన్ని రకరకాల గెటప్పుల్లో చూపిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కంటే కూడా ఎన్టీఆర్ పాత్రే హైలైట్ అవుతుందని తాజా సమాచారం.

ఆరంభంలో షరాయి-లాల్చీతో ఉన్న ఎన్టీఆర్ ని చూపిస్తూ.. చివరికి తలకు పాగా చుట్టుకున్న గెటప్ తో టీజర్ ముగుస్తుందని సమాచారం. టీజర్ లో కనిపించే గెటప్పులన్నీ కూడా అభిమానులను ఆకట్టుకునేలా చిత్రీకరించారని చెబుతున్నారు. ఇదే నిజమైతే.. ఈ టీజర్ రికార్డులు సృష్టించడం ఖాయం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి అలియా భట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: