బిగ్ బాస్ సీజన్ 4 ఆరవ వారం ఎలిమినేట్ అయ్యాడు కుమార్ సాయి. ఈ ఎలిమినేషన్ అంతా ఫేక్ అని.. కుమార్ సాయికి తామంతా ఓట్లు వేస్తే అతను ఎలా బయటకు వస్తాడని.. మోనాల్ ను సేవ్ చేసేందుకు కుమార్ సాయిని బలి చేశారని ఆడియెన్స్ ఫీల్ అయ్యారు. అయితే కుమార్ సాయి ఎలిమినేషన్ ప్రక్రియలో ఎలాంటి రాజకీయాలు జరగలేదని తెలుస్తుంది. బిగ్ బాస్ చరిత్రలో అతనికి వచ్చిన ఓట్లు చాలా తక్కువని అంటున్నారు.

వాస్తవంగా చూస్తే హౌజ్ లో కుమార్ సాయి పెద్దగా చేసింది ఏమి లేదు. మొదటి రెండు వారాలు ఆయన సైలెంట్ గానే ఉన్నాడు. టాస్కుల్లో కూడా చురుగ్గా పాల్గొనలేదు. ఇప్పుడిప్పుడే టాస్కులు చేస్తున్నాడు. బయట కమెడియన్ కాబట్టి హౌజ్ లో కూడా తన కామెడీతో అలరిస్తాడని అనుకుంటే అతను మాత్రం ఒంటరిగా ఆట ఆడుతున్నాడు. అదే అతన్ని ఆడియెన్స్ కు దూరమయ్యేలా చేసింది. కొన్ని ఎపిసోడ్స్ లో కుమార్ సాయికి అసలు స్క్రీన్ స్పేస్ లేకుండా ఉంది.

అందుకే కుమార్ సాయికి ఓట్లు తగ్గాయని తెలుస్తుంది. కొందరు కుమార్ సాయి ఎలిమినేషన్ రాంగ్ అని అంటుంటే.. కొందరు మాత్రం అతను వెళ్లడమే కరెక్ట్ అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సీజన్ లోనే దివి ఎలిమినేట్ అయినప్పుడు బిగ్ బాస్ ఓట్ల ప్రకారంగా ఎలిమినేట్ చేయట్లేదని ఎలాగైతే వార్తలు వచ్చాయో కుమార్ సాయి విషయంలో కూడా అలానే వచ్చాయి. కుమార్ సాయి ఎలిమినేషన్ మాత్రం అతనికి వచ్చిన లీస్ట్ ఓట్లని బట్టే అని అంటున్నారు.                                                           


మరింత సమాచారం తెలుసుకోండి: