ఎన్టీఆర్ కొమరం భీమ్ గెటప్ తో వచ్చిన టీజర్ అత్యథిక లైక్స్ సాధించిందని ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన టీజర్స్ అన్నిటిలో ఎన్టీఆర్ టీజర్ కే ఎక్కువ లైక్స్ వచ్చాయని అంటున్నారు. 24గంటల వ్యవధిలో మిలియన్ లైక్స్ సాధించిందని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ లుక్ అదుర్స్ అని, అందుకే టీజర్ దుమ్మురేపిందని సంతోషపడుతున్నారు.
అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ టీజర్ మిలియన్ లైక్స్ కి కాస్త దూరంలో ఆగిపోయిందని మరో బ్యాచ్ ప్రచారం చేస్తోంది. టీజర్ రిలీజైన 24గంటల్లో దీన్ని మిలియన్ లైక్స్ కి షేర్ చేయాలని అభిమానులు ముందునుంచీ ప్లాన్ చేసినా అది వర్కవుట్ కాలేదట. జస్ట్ 70వేల గ్యాప్ తో టీజర్ ఆ అరుదైన రికార్డ్ ని మిస్ అయిందట. అయితే ఎన్టీఆర్ టీజర్ మాత్రం అదిరిపోయిందని, రోజంతా దేశవ్యాప్తంగా అదే ట్రెండింగ్ లో ఉందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ టీజర్ పై రాజమౌళి చాలా కసరత్తులే చేశారు. లాక్ డౌన్ తర్వాత కేవలం టీజర్ కోసమే రెండు రోజులపాటు షూటింగ్ జరిపారు. ప్రోమో షాట్స్ తీసి ఆ తర్వాత మరో నాలుగురోజులపాటు దాన్ని పక్కాగా ఎడిటింగ్ చేశారు. రామ్ చరణ్ వాయిస్ మాత్రం గతంలోనే డబ్బింగ్ చెప్పించి ఉంచారని తెలుస్తోంది. మొత్తానికి పక్కాగా ఎన్టీఆర్ టీజర్ బైటకు వచ్చింది. అయితే రామరాజు ఫర్ భీమ్ అనే టీజర్ కంటే.. భీమ్ ఫర్ రామరాజు అనే టీజరే బాగుందని కొంతమంది అంటున్నారు. ఎన్టీఆర్ వాయిస్ రామరాజు ఎలివేషన్ కి బాగా సూట్ అయిందని, రామ్ చరణ్ వాయిస్ మాత్రం భీమ్ ని ఎలివేట్ చేయడానికి సరిపోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే టీజర్ వ్యూస్ లో మాత్రం రెండూ అదరగొట్టాయి. ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన రెండు టీజర్స్ పోటాపోడీగా వ్యూస్ సాధించాయి. టీజర్ కోసం కొన్ని షాట్స్ తీసి ఆ తర్వాత షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన దర్శకుడు రాజమౌళి.. త్వరలోనే మళ్లీ పని మొదలు పెడతారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: