అవునూ.. సీనియర్
హీరో శ్రీకాంత్ పెళ్లి సందడి సినిమాకు
రీమేక్ రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాలో
శ్రీకాంత్ తనయుడు
రోషన్ హీరోగా నటించనున్నాడని నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా
హీరోయిన్ గా
మాళవిక నాయర్ ను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..

ఇక అసలు వివరాల్లోకి వెళితే..
శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ తారాగణంతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన "పెళ్లి సందడిి" చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ
సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి
కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి. ఈ సినిమాతోనే
శ్రీకాంత్ కి స్టార్ డం వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ తో తాజాగా తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు రాఘవేంద్రరావు. అంతేకాండోయ్.. ఒరిజినల్ నటించిన
శ్రీకాంత్ కొడుకు
రోషన్ హీరోగా తీసుకున్నాడు. నిన్న ఓ వీడియో ద్వారా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు.
.jpeg)
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో
హీరోయిన్ గా
మాళవిక నాయర్ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు
మూవీ యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.
మాళవిక నాయర్ "ఎవడే సుబ్రమణ్యం" సినిమాతో
హీరోయిన్ గా
టాలీవుడ్ కి పరిచయమైంది. "కళ్యాణ వైభోగమే", "టాక్సీవాలా" సినిమాలతో ఆకట్టుకుంది ఈ భామ.. ఇక తాజాగా "ఒరేయ్ బుజ్జిగా" సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ముందుగా కొత్త అమ్మాయిని తీసుకుందాం అనుకున్నప్పటికీ ఫైనల్ గా మాళవికని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి
శ్రీకాంత్ కి స్టార్ డం తీసుకొచ్చిన "పెళ్లి సందడి" అతని కొడుక్కి కూడా అలాంటి స్టార్ డం తీసుకొస్తుందా అనేది చూడాలి..