ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ లో జూ. ఎన్టీఆర్ కొమురం భీం ఇన్స్పిరేషన్ పాత్రలో కనిపిస్తారు అని దర్శకులు రాజమౌలి చెప్ప్పిన దగ్గరి నుండి ఈ సినిమా పైన, ఈ సినిమాలో ఎన్టీఆర్ చేయబోయే పాత్ర పైన చాల ఉత్కంఠ నెలోకొంది…అస్సలు ఎవరు ఈ కొమురం భీం ? ఈయన స్టోరీ మన జక్కన్న ని ఎందుకు అంతలా ప్రభావితం  చేసింది ?... తెలియాలంటే ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

కొమురం భీమ్ గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్, సోంబాయి దంపతులకు 1901 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు.  ఆదివాసీల పైన నిజం నవాబుల నిరంకుశ పాలనా పైన ఉద్యమించి…వారి గుండెల్లో గుబులు పుట్టించాడు కొమరం భీమ్.

భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్ ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయుంలో భాగమని జల్..జంగిల్…జంగ్ అనే నినాదాం నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు…

నీరు, అడవి, కోసం అవసరమైతే యుద్ధం చేయాలి అనే మన కొమురం భీం ఇచ్చిన స్ఫూర్తి తో  మూవీ లో జూ ఎన్టీఆర్ చేస్తున్న రోల్ రాసుకున్నారు రాజమౌళి…అందుకే తారక్ కి నీటి గుణం…రామరాజు కి అగ్గి గుణం ని జోడించి  చేసిన పోస్టర్స్, టీజర్స్ మనం టీజర్స్ లో చూడొచ్చు… ఇక ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...




మరింత సమాచారం తెలుసుకోండి: