ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఇప్పటిదాకా వారసత్వం పరంగా చూసుకుంటే
సూపర్ స్టార్ మహేష్,
పవన్ కళ్యాణ్,
రామ్ చరణ్,
ఎన్టీఆర్,
ప్రభాస్ వీళ్ళు మాత్రమే గొప్ప స్టార్ హీరోలుగా టాప్ 5 లో వున్నారు.దానికి కారణం కేవలం వారసత్వమే కాదు ప్రతిభ కూడా కావలి. నట వారసత్వాలు పనిచేసినా ప్రస్తుత కాలంలో ఎవరు స్టార్ హీరోలు అవ్వడం లేదు. ఇండస్ట్రీకి చెందిన వారు తమ వారసులను సినిమాల్లోకి తీసుకొచ్చినా.. వారిలో టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు మరో సినీ వారసుడు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నటుడు
రాజీవ్ కనకాల, యాంకర్ సుమల కొడుకు
రోషన్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఫుల్ కంటెంట్ తోనే
రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని అంటున్నారు. తమ కొడుకు
ఇండస్ట్రీ లో కచ్చితంగా పెద్ద స్టార్ అవుతాడని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. జె.బి ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్‌పై
హరి ప్రొడ్యూసర్‌గా,
విజయ్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో
రోషన్ సినిమా చేయబోతున్నాడు. ఇటీవల ఈ
సినిమా పూజా కార్యక్రమాలు కూడా చేపట్టారు.తన కొడుకు
సినిమా ఎంట్రీ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు
రాజీవ్ కనకాల.
సుమకి
రోషన్ ని హీరోగా చేయడం ఇష్టమేనని.. మొదటినుండి కూడా పిల్లలకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయమని
సుమ చెప్పేదని
రాజీవ్ అన్నారు.
హీరో అనే కాదు.. ప్రొడక్షన్ అయినా..
ప్రొడ్యూసర్ ఇలా ఏదైనా సరే ఇష్టం లేకుండా చేయకని సుమ..
రోషన్ కి చెప్తూనే ఉంటుందని
రాజీవ్ అన్నారు.
రోషన్ కి మంచి టాలెంట్ ఉంది. భవిష్యత్తులో గొప్ప స్టార్ అవుతాడు ఆ నమ్మకం నాకు ఉంది అని
రాజీవ్ కనకాల అన్నాడు. ఇక
రాజీవ్ కనకాల కుటుంబంలో అందరూ స్టార్లే. ఇక వీళ్ళ వారసుడు కూడా గొప్ప స్టార్
హీరో అయ్యి, తన తల్లి దండ్రులు లాగా
ఇండస్ట్రీ లో విజయవంతంగా దూసుకుపోవాలని కోరుకుందాం.... ఇలాంటి మరెన్నో
మూవీ ఆర్టికల్స్ కోసం
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరిన్ని
మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....