ఒకప్పుడు పూరీ జగన్నాథ్ సినిమాలలో నటించే అవకాశం కోసం టాప్ హీరోలు అంతా ఎదురు చూసేవారు. అయితే పూరీకి వరసగా ఫ్లాప్ లు ఎదురు కావడంతో టాప్ హీరోల మధ్య పూరీ మ్యానియా బాగా తగ్గిపోయింది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఘన విజయంతో పూరీ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినా పూర్తిగా టాప్ హీరోలు అతడిని సక్సస్ విషయంలో నమ్మలేకపోతున్నారు.


ఇలాంటి పరిస్థితులలో పూరీ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఒక మూవీని తీసి టాప్ హీరోలకు తాను ఏమిటో మళ్ళీ చూపించాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే కరోనా పరిస్థితులు వల్ల ఈమూవీ షూటింగ్ గత కొన్ని నెలలుగా ఆగిపోవడంతో ఖాళీగా ఉన్న పూరి రకరకాల కథలు ఆలోచిస్తూ మధ్యలో పూరీ మ్యూజింగ్స్ పేరుతో సోషల్ మీడియాలో తన భావాలను అందరికీ తెలిసే విధంగా అనేక విషయాల పై స్పందిస్తున్నాడు.


ఇలాంటి పరిస్థితులలో పూరీ ఈమధ్య సోషల్ మీడియాలో బ్రిటీష్ వారిని పొగుడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. శతృవు నుంచి అయినా మంచి గ్రహించాలని కామెంట్ చేస్తూ అతి తక్కువ జనాభా కలిగిన బ్రిటీష్ వాళ్ళు రవి అస్తమించని మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పడమే కాకుండా ప్రపంచంలోని ప్రజలందరికీ ప్యాంట్ షార్ట్ వేసుకోవడం నేర్పించడమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలను అత్యంత సమర్థవంతంగా పరిపాలన చేసిన ఘనత బ్రిటీష్ వారికి ఉందని అలాంటి సమర్థత మనకు ఎందుకులేదు అంటూ పూరీ ఆవేదన చెందుతున్నాడు.


అంతేకాదు బ్రిటీష్ వారి వల్ల మన దేశ ప్రజలకు ఎంతో మేలు జరిగింది అన్న అభిప్రాయంలో కూడ పూరీ ఉన్నాడు. ‘మాకు స్వాతంత్ర్యం వద్దు. మమ్మల్ని పాలించండి. లేదంటే మా దేశ అభివృద్ధి ఆగిపోతుంది అంటూ హాంకాంగ్ ప్రజలు బ్రిటీష్ వారిని అడిగారు అంటే బ్రిటీష్ గొప్పతనం ఏమిటో తెలుస్తుంది అంటూ పూరీ బ్రిటీష్ వారిని ఆకాశానికి ఎత్తేసాడు. అంతేకాదు వందల దేశాలను బ్రిటీష్ వాళ్లు పాలించారంటే మాట‌లు కాద‌ని ఎంత క్రమశిక్షణగా పనిచేశారో అర్థం చేసుకోవాల‌ని పూరీ అభిప్రాయ పడుతున్నాడు. మంచి అనేది మన శత్రువులో ఉన్నా నేర్చుకోవాల‌ని హిత‌వు చెపుతున్న పూరీ మాటలలోని భావం అర్థం అయ్యేలా ఉన్నప్పటికీ అఖండ భారత దేశాన్ని బ్రిటీష్ వారు పరిపాలించడానికి భారతీయుల మధ్య మత పిచ్చి ప్రాంతాల పిచ్చి కులాల పిచ్చి రగిల్చిన ఘనత బ్రిటీష్ వారి సొంతం అన్నది పూరీకి తెలియదా అన్నదే సమాధానం లేని ప్రశ్న..  


మరింత సమాచారం తెలుసుకోండి: