బన్నీ, సుకుమార్‌ మూవీ 'పుష్ఫ' ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురుచూశారు. మారేడిపల్లి అడవుల్లో మొదలై 20 రోజులపాటు భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుందో లేదో.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసేశారు నిర్మాతలు. బయటకు ఎనౌన్స్‌ చేయక పోయినా.. పుష్ప థియేటర్స్‌లోకి ఎప్పుడు వస్తుందో తెలుసా?

అల వైకుంఠపురంలో రిలీజ్‌కు ముందే బన్నీ సుకుమార్ మూవీకి కమిట్‌ అయ్యాడు. సినిమా మొదలయ్యేలోగా.. కరోనా ఈ కాంబినేషన్ని అడ్డుకుంది. ఈలోగా 9 నెలలు గడిచిపోయింది. ఎట్టకేలకు షూటింగ్‌ స్టార్ట్‌ చేసి.. మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.  ఫారెస్ట్‌ షెడ్యూల్‌ పూర్తిచేసుకొచ్చిన పుష్ప రౌడీ హీరో విజయదేవరకొండ పంపించిన చొక్కా వేసుకుని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు బన్నీ.

ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురంలోతో వచ్చిన బన్నీని చూడాలంటే.. ఇంకో 10 నెలలు వెయిట్ చేయాలి. ఇప్పటికే షూటింగ్‌ మొదలైంది కాబట్టి... పుష్ప 2021 సమ్మర్‌కు వచ్చేస్తుందన్న ఫీలింగ్‌తో అభిమానులు ఉన్నారు. సుకుమార్‌ మూవీ ఎప్పుడూ అనుకున్న సమయంలో పూర్తికాదు. అందుకే.. కాస్త ఆలస్యమైనా.. 2021 దసరాకు రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్‌.

హీరోలను డిఫరెంట్‌గా చూపించే సుకుమార్‌ బన్నీని గుబురు గడ్డం.. హెయిర్‌తో మాసీ లుక్‌తో చూపిస్తున్నాడు. పుష్పలో బన్నీ లారీడ్రైవర్‌ కావడంతో.. ఏడాది నుంచి  ఈలుక్‌ మెయిన్‌టేన్‌ చేస్తున్నాడు బన్నీ. షూటింగ్‌ పూర్తయ్యేవరకు ఇంకో 8 నెలలు ఇదే గెటప్‌తో కనిపిస్తాడు స్టైలిష్‌ స్టార్‌.

మొత్తానికి 2021 దసరా రేసులో పుష్ప ఉంది. అయితే 20రోజుల ఫారెస్ట్ షెడ్యూల్ ను సుకుమార్ ఇప్పటికే పూర్తి చేశాడు. దసరా రిలీజ్ కు నిర్మాతలు సన్నాహాలు చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పంపించిన బట్టలతో బన్నీ సందడి చేశాడు. రౌడీ వేర్ ధరించి ఫోటోలు పోస్ట్ చేయడంతో ఇపుడు నెట్ లో వైరల్ గా మారింది. చూద్దాం.. పుష్ప ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో.







మరింత సమాచారం తెలుసుకోండి: