కె.జి.ఎఫ్ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన ప్రశాంత్ నీల్ ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో చాప్టర్ 2 ని మరింత గ్రాండ్ గా చేస్తున్నాడు. ఇక ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కాస్టింగ్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవట్లేదని తెలుస్తుంది. సినిమాను ఎలాగు పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నారు కాబట్టి అన్నిచోట్ల పాపులర్ అయిన వారిని చూస్తున్నారట.
ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో కెల్విన్ క్లెయిన్ బిక్ని భామ దిశా పటానిని ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగులో లోఫర్ సినిమా చేసి మళ్లీ కనిపించకుండాపోయిన దిశా పటాని బాలీవుడ్ లో మాత్రం వరుస ఛాన్సులు అందుకుంటుంది. ప్రభాస్ సలార్ మూవీలో ఆమె నటిస్తే మాత్రం సినిమాకు గ్లామర్ విషయంలో డౌట్ లేదని చెప్పొచ్చు. రాధే శ్యాం సినిమా చేస్తున్న ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా ఆదిపురుష్ సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమాతో పాటుగా సలార్ షూట్ చేస్తారని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి