అనిల్ రావిపూడి దిల్ రాజు కాంబినేషన్ లో రాబోతున్న ‘ఎఫ్ 3’ మూవీకి సంబంధించిన పోస్టర్ ను మొన్న జరిగిన వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టర్ ను చూసిన ఇండస్ట్రీ వర్గాలలో కొందరు సెటైర్లు వేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ స్క్రిప్ట్ అంతా డబ్బుల చుట్టూ తిరిగే పాయింట్ తో అనిల్ రావిపూడి తయారు చేసినట్లు టాక్.  


ఈసినిమాలో హీరోలుగా నటిస్తున్న వెంకటేష్ వరుణ్ తేజ్ లు ఇద్దరూ  గార్బేజ్ ట్రాలీల్లో డబ్బులు పోసుకుని వెళ్తున్నట్లుగా ఆ పోస్టర్ డిజైన్ చేయడంతో ఆ పోస్టర్ పై ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి. ఈ సీక్వెల్ లో నటిస్తున్నందుకు వెంకటేష్ వరుణ్ తేజ్ లు తాము సాధారణంగా తీసుకునే పారితోషికానికి రెట్టింపు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.


దీనితో వీరి డిమాండ్స్ కాదనలేక దిల్ రాజ్ ఈ పారితోషికాల పెంపుకు ఒప్పుకున్నాడు అన్న గాసిప్పులు కూడ వచ్చాయి. దీనితో అనీల్ రావిపూడి ఈ సినిమాలో ఫన్ ఫ్రస్టేషన్ తో పాటు మనీ పవర్ కూడ ఉంటుంది అన్న సంకేతాలు ఇవ్వాలని ప్రయత్నిస్తే ఇది పరోక్షంగా వెంకటేష్ వరుణ్ తేజ్ లు ఈసినిమాలో నటించినందుకు తీసుకున్న భారీ పారితోషికాలకు సింబాలిక్ గా ఉంది అంటూ కొందరు జోక్ చేస్తున్నారు.  


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో మళ్ళీ తమన్నా మెహరీన్ లు రిపీట్ అవుతున్నారని టాక్. అంతేకాదు ఈ మూవీలో ‘ఎఫ్ 2’ కంటే ఎక్కువ గ్లామర్ ఎక్స్ పోజింగ్ షోను ప్రేక్షకులు చూపించడానికి తమన్నా మెహరిన్ లతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా వెంకీ వరుణ్‌ తో రొమాన్స్ చేస్తారట. ఇక ఈ ప్రాజెక్ట్ లో మరో స్టార్ హీరోయిన్‌ కూడ అతిధి పాత్రలలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి లాక్‌ డౌన్ తర్వాత సినిమాలలో నటించే నటీనటులకు పారితోషికాలు తగ్గించాలి అన్న డిమాండ్ వస్తుంటే ఈ విషయాలు ఏమీ పట్టించుకోకుండా దిల్ రాజ్ ఈమూవీ ప్రాజెక్ట్ లో నటించే హీరోలు ఇద్దరికీ పారితోషికం మరింత పెంచడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: