చిరంజీవి మెగా హీరోగా సినిమాలలో ఎందరో పాపులర్ విలన్స్ ను చితకకొట్టాడు. సినిమాలలో విలన్ ఎంత పవర్ ఫుల్ అయినా క్లైమాక్స్ లో హీరో చేతిలో చావుదెబ్బలు తినాల్సిందే. అలాంటి సీన్స్ లేకపోతే జనం చూడరు. కాని ‘ఆచార్య’ సినిమాలో మాత్రం చిరంజీవి విలన్ సోనూ సూద్ ను కొట్టేందుకు కాస్త వెనుకంజ వేశాడట.
ఈ విషయాన్ని స్వయంగా సోనూ సూద్ ఈమద్య ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలియచేసాడు. ప్రస్తుతం రియల్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సోనూ సూద్ కు టాప్ హీరోల కంటే విపరీతమైన క్రేజ్ లో కొనసాగుతూ రియల్ హీరో గా మన్ననలు పొందుతున్నాడు.
అంతేకాదు బాలీవుడ్ హీరోల కంటే సోనూ సూద్ కు ఇప్పుడు ఎక్కువ పేరుంది. ప్రస్తుతం నేషనల్ సెలిబ్రిటీ హోదాలో ఉన్న అతడు ‘ఆచార్య’ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మధ్య ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో చిరంజీవి ఒక సీన్ లో సోనూ సూద్ ను తన్నాల్సి ఉంది. అయితే ఆసీన్ ను మార్చమని చిరంజీవి కొరటాలకు సలహా ఇచ్చాడట.
అంతేకాదు ఈ మూవీ షూటింగ్ లో భాగంగా ముందుగా అనుకున్న ఫైట్ సీన్ ను కాకుండా ఇప్పుడు మార్చవలసి వస్తోందోదని తెలుస్తోంది. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో చిరంజీవి సోనూ సూద్ ను కాలితో తన్నే సీన్ ఉందట. ఆ సీన్ లో నటించడానికి సోనూ సూద్ ఒప్పుకున్నా చిరంజీవి ఒప్పుకోలేదట. అంతేకాదు ఆ సీన్ కు చిరంజీవి అభ్యంతరం తెలియచేస్తూ సోనూ సూద్ పై తాను కాలు లేపితే ప్రేక్షకులు తనను తీవ్రంగా విమర్శిస్తారు అంటూ సోనూ సూద్ పై ఆ కాలు పెట్టే సీన్ ను కట్ చేసి దాని ప్లేస్ లో మరో షాట్ ను ప్లాన్ చేయమని చిరంజీవి కొరటాల కు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోనూసూద్ పారితోషికం భారీగా పెంచి 4 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి