ఈ తాజా సీజన్ లో టాప్ 5 లో ఒకరిగా నిలిచారు ఆమె.ఇక మధ్యలో పలు టాస్క్ ల్లో కూడా తన ఆకట్టుకునే ఆటతీరుతో కొనసాగిన అరియానా గేమ్ కోసం అలానే విజయం కోసం ఎంతో శ్రమించారు అని చెప్పాలి. మధ్యలో అక్కడక్కడా కొన్ని సంఘటనల వల్ల ఆమె విమర్శల పాలైంది, అప్పటికి కూడా మొక్కవోని దీక్షతో పోరాడుతూ ముందుకుసాగారు అరియానా. ఇక ఆమె కు ఓటు వేయాలని కోరుతూ ఇటీవల రాంగోపాల్ వర్మ ఒక మీడియా చానల్ ని ఇంటర్వ్యూ లో భాగంగా అభిమానులని కోరడం జరిగింది. నిజానికి అంతకు ముందు ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా వర్మ ని ఇంటర్వ్యూ చేసింది అరియానా, ఆ సమయంలో ఆమె పై పొగడ్తలు కురిపించారు వర్మ.
ఇటీవల ఎట్టకేలకు షో ముగిసిన అనంతరం కొద్ది రోజుల క్రితం అరియానాని కలిసిన వర్మ ఆమెకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరి కొద్ది రోజుల్లో తాను తెరకెక్కించబోయే ఒక ఒక సినిమాలో ఆమెని ప్రధాన పాత్రకి ఎంపిక చేశారట. అలానే ఆ సినిమా కథాకథనాలు వినిపించిన వర్మ అరియానా ఒప్పుకోవడంతో తన నుండి కాల్షీట్లు కూడా తీసుకున్నారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు వెళ్తుందని అలాగే రిలీజ్ అనంతరం తప్పకుండా ఈ సినిమా ద్వారా అరియానా కి నటిగా మంచి పేరు తెచ్చిపెడుతుందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంత వరకు వాస్తవం ఉందొ తెలియదు కానీ ఒకవేళ ఇదే గనుక నిజమైతే మాత్రం ఇది నిజంగా అరియానా ఫ్యాన్స్ కి గొప్ప పండుగ న్యూస్ అని చెప్పక తప్పదు......!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి