2020ను ఎవరూ మర్చిపోలేరు. ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన కరోనా మహ్మారితో అందరూ నష్టపోయారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ ఎక్కువ కష్టాలు ఫేస్‌ చేసింది. కరోనా రాకతో 10 నెలలపాటు  షూటింగ్స్‌.. రిలీజెస్‌ లేవు. నిర్మాతలు.. ఎగ్జిబిటర్లు.. సినీ కార్మికులు ఒకరేంటి అందరూ బ్యాడ్‌ పిరియడ్‌ చూశారు. 2020 కరోనా నామసవంత్సరంగా చిత్రసీమలో మాయని మచ్చగా మిగిలిపోయింది.

కరోనా పిడుగు సినిమా ఇండస్ట్రీపై బలంగా పడింది. కరోనాకు ముందు తెలుగు సినిమా రిజల్ట్‌ ఆశాజనకంగా ఉంది. సంక్రాంతికి రిలీజైన పెద్ద సినిమాలు  అల వైకుంఠపురంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సరిలేరు నీకెవ్వరు సూపర్‌హిట్‌ కాగా... భీష్మతో నితిన్‌ హిట్ కొట్టాడు. హిట్‌.. కనులు కనులను దోచాయంటే... వంటి హిట్‌ మూవీస్‌ పెట్టుబడిని రాబట్టాయి.  

సంక్రాంతికి వచ్చిన మహేశ్‌, బన్నీ సినిమాలు పోటాపోటీగా వసూళ్లు రాబట్టాయి. అల వైకుంఠపురంలో అయితే సంక్రాంతి వసూళ్లను ఎడాపెడా దోచేసి కొత్త రికార్డులు నెలకొల్పింది. అప్పటివరకు నాన్‌ బాహుబలి పేరు మీదున్న రంగస్థలం రికార్డ్‌ను క్రాస్‌ చేసింది.  సినిమాను 90 కోట్లకు అమ్మితే.. దాదాపు 160 కోట్లు తీసుకొచ్చింది. చాలాచోట్ల పెట్టుబడికి డబుల్‌ రాబట్టింది. మహేశ్‌, అనిల్‌ రావిపూడి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు..హీరో కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలిచింది. సినిమాను 100 కోట్లకు అమ్మితే.. 130 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లోమినహా డిస్ట్రిబ్యూటర్స్‌ అందరికీ లాభాలు తీసుకొచ్చింది.

సంక్రాంతి బరిలో ముందుగా దర్బార్‌ రిలీజ్‌ అయింది. సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆశగా ఎదురుచూసిన దర్బార్‌ డబ్బులు రాబట్టలేకపోయింది. సంక్రాంతి హిట్ష్‌ తర్వాత  భీష్మ ఒక్కటే ప్రేక్షకులను మెప్పించింది. సైలెంట్‌గా వచ్చిన డబ్బింగ్‌ మూవీ "కనులు కనులను దోచాయంటే' పాజిటివ్‌ టాక్‌తో టాక్‌ ఆఫ్‌ది ఇండస్ట్రీ అయింది.  దుల్కర్‌ సల్మాన్; రీతువర్మ జంటగా నటించిన ఈ సినిమా గుందన్న రెస్పాన్స్‌ వచ్చినా... కరోనా లాక్‌డౌన్‌తో మంచి వసూళ్లు రాబట్టలేకపోయినా.. టాక్‌తో బ్రేక్‌ ఈవెన్‌ అయింది. కరోనా ముందు రిలీజ్ అయిన హిట్‌ మూవీ పెట్టుబడిని రాబట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: