సూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటిస్తుందని అన్నారు. మహేష్ కు సిస్టర్, వదిన పాత్రలో ఆమె కనిపిస్తుందని అన్నారు. కాని అసలు విషయం ఏంటంటే సినిమాలో రేణు దేశాయ్ నటించేది ఇంకా కన్ ఫాం అవలేదట.

తనకు కరోనా వచ్చిందని వార్త పబ్లిష్ చేసిన వెబ్ సైట్ పై వీరంగం ఆడింది రేణు దేశాయ్. ఇలాంటి స్టుపిడ్ వెబ్ సైట్స్ ను ప్రజలు నమ్మొద్దని.. సెలబ్రిటీల జీవితాల మీద బ్రతుకుతారని ఘాటుగానే స్పందించారు రేణు దేశాయ్. ఇక మహేష్ సినిమాలో తాను నటించే విషయం గురించి కూడా తాను ఏదైనా సినిమా చేస్తే తప్పకుండా మీకు చెబుతా అని సోషల్ మీడియా వేదికపై చెప్పారు రేణు దేశాయ్. అంటే మహేష్ సినిమాలో రేణు దేశాయ్ నటించే న్యూస్ ఫేక్ అని తెలుస్తుంది.

ఇలా ఒకరి సినిమాలో నటించడం లాంటి వార్తలు రాసినా సెలబ్రిటీస్ పెద్దగా పట్టించుకోరు కాని ఏకంగా రేణు దేశాయ్ కు కరోనా అని వార్తలు రాయగానే ఆమెకు ఎవరెవరో ఫోన్ చేసి అడగడం ఆమె ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఆ వెబ్ సైట్ మీద ఎటాక్ చేయడం జరిగింది. మొత్తానికి రేణు దేశాయ్ మహేష్ సినిమాలో ఉంటుందని అనుకున్న ఫ్యాన్స్ కు ఓ క్లారిటీ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: