అట్టహాసంగా జరిగిన ఈ పెళ్ళికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి... అయితే తన పెళ్లి వేడుకను స్వర్గంతో పోల్చిన సునీత నూతన జీవితం ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.కరోనా పరిస్థితుల రీత్యా అతి తక్కువ మంది కుటుంబసభ్యులతో గుడిలోనే వివాహం చేసుకోవాలనుకున్నాం. కానీ మా ఇద్దరి కుటుంబాలు చాలా పెద్దవి కావడంతో పెళ్లికి 200 మంది వరకూ హాజరయ్యారు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది' అని సునీత తెలిపారు..ఇక ఇదిలా ఉంటె తన స్నేహితురాలికి వివాహం జరిగిన విషయం తెలుసుకున్న ప్రముఖ యాంకర్ సుమ చాలా సంతోషంగా వ్యక్తం చేసింది.
ఒంటరి జీవితంను గడుపుతున్న స్నేహితురాలు ఇన్నాళ్లకు అయినా తోడును వెదుక్కోవడం పట్ల సుమ ఆనందంగా ఉందట. ఇక సునీత వివాహం సందర్బంగా సుమ ఏకంగా లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ ను గిప్ట్ గా ఇచ్చింది. ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న సుమ డైమండ్ నెక్లెస్ ఇవ్వడం పెద్ద విషయం కాదు. కాని అత్యంత క్లోజ్ గా ఉన్న వారికి మాత్రమే అంత విలువైన బహుమానాలు ఇస్తూ ఉంటారు. అంత ఖరీదైన బహుమానంను సునీతకు సుమ ఇచ్చారు అంటే ఇద్దరి మద్య ఎంతటి సన్నిహిత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు...!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి