అక్కినేని హీరో నాగ చైతన్యతో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఆ సినిమా ఫ్లాపైనా సరే మరో అక్కినేని హీరో అఖిల్ ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన మిస్టర్ మజు ను సినిమాలో ఆమె నటించింది. అయితే ఆ సినిమా కూడా నిధి అగర్వాల్ కు లక్ కలిసి రాలేదు. అక్కినేని హీరోలిద్దరికి ఫ్లాపులు ఇచ్చిన ఈ భామ కెరియర్ దాదాపు ముగిసింది అనుకునే లోగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ లో అమ్మడికి ఛాన్స్ ఇచ్చాడు.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ అందాల ప్రదర్శన సినిమాకు హైలెట్ గా నిలిచింది. సినిమాలో నిధితో పాటుగా నటించిన నభా నటేష్ కూడా ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇస్మార్ట్ హిట్ తర్వాత నిధికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా వస్తున్న సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమా తర్వాత నిధి అగర్వాల్ రెండు మూడు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

సినిమాలతోనే కాకుండా హాట్ ఫోటో షూట్స్ తో అమ్మడు అలరిస్తుంది. నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటో షూట్ ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో నిధి స్కిన్ షో పిక్స్ వైరల్ గా మారాయి. గ్లామర్ షో విషయంలో వెనక్కి తగ్గేది లేదనేలా అమ్మడి టాలెంట్ చూపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమా మరోటి పడితే మాత్రం నిధి అగర్వాల్ రేంజ్ పెరుగుతుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: