ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు తమ నటనతో ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు. ఒక సినిమాకు కథ ప్రావీణ్యం ఎంత ఉంటుందో,ఆ సినిమాలో నటించే హీరో హీరోయిన్లతో పాటు కామెడీ పాత్రలో నటించే నటులకు కూడా అంతే ప్రావీణ్యం ఉంటుంది. సినిమా ఎంత ఫ్యాక్షనిస్ట్ గా ఉన్నా , మాస్ యాంగిల్ లో ఉన్నా , లేదా  లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు  అయినప్పటికీ కూడా అందులో కొద్దో గొప్పో హాస్యం పండించాల్సిందే . ఒకవేళ ఆ సినిమాలలో కామెడీ లేకపోతే,ఆ సినిమాలు  చూడ్డానికి కూడా ఎవరూ ఇష్టపడరు.

అయితే కొంతమంది ఒంటరిగా ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటే, మరి కొంతమంది జంటలుగా వచ్చి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించేస్తున్నారు. అలా మన తెలుగు ఇండస్ట్రీలో నాటి నుంచి నేటి వరకు కొన్ని జంటలు చిరస్మరణీయంగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఇప్పుడు ఆ జంటలు ఎవరో తెలుసుకుందాం.

సూర్యకాంతం  - ఛాయాదేవి:
వీరిద్దరు సినిమాలో ఉన్నారు అంటే చాలు పొట్ట చెక్కలవ్వాల్సిందే. టామ్ అండ్ జెర్రీ లా ఉండే ఈ జంట ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.

రేలంగి  - సూర్యకాంతం:
పాత సినిమాలలో రేలంగి  నటిస్తున్నారు అంటే వారికి తగ్గ జోడిగా సూర్యకాంతం ఎప్పుడూ ఉంటుంది. వీరిద్దరి జంట అంతలా హాస్యాన్ని పండించేది మరీ.

పద్మనాభం -  గీతాంజలి:
వీరి నటనకు నంది అవార్డు ఇచ్చినా కూడా తక్కువే. అంతలా వీరి నటనతో ప్రేక్షకులను మైమరపించేవారు.

రాజబాబు -  రమాప్రభ:
రాజబాబు  తింగరి గా నటిస్తూ, అందర్నీ నవ్వించేవాడు. అలాగే ఆయన సరసన రమాప్రభ బాగా సెట్ అయ్యేది. వీరిద్దరి జంట ప్రేక్షకులకు కన్నులపండుగగా ఉండేది.

రామ్ గోపాల్ రావు - అల్లు రామలింగయ్య:
ఏ సినిమాలో చూసినా వీరిద్దరి జంట ముందుగా ఉంటుంది. రాం గోపాల్ రావు  అజమాయిషీ చలాయిస్తే, ఇక ఆయన కింద అల్లు రామలింగయ్య కన్నం పెట్టే  ఎలుక లాగా ఎప్పుడూ ఆయనతో ఉండే  సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.

కోట శ్రీనివాస రావు  - బాబు మోహన్:
వీరిద్దరి జంట గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. అంతలా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.

బ్రహ్మానందం -  కోవై సరళ:
ప్రస్తుతం వస్తున్న అన్ని సినిమాల్లో వీరి జంట అద్భుతంగా రాణిస్తోంది. వీరిద్దరి కామెడీకి పొట్ట చెక్కలు అవ్వాల్సిందే.

ఇక అలాగే వీరభద్రరావు - సుత్తివేలు,ధర్మవరం సుబ్రహ్మణ్యం -  ఎమ్మెస్ నారాయణ, కొండ వలస - తెలంగాణ శకుంతల, రేలంగి -  రమణారెడ్డి లాంటి ఎంతో మంది జంటలు  తమ నటనతో, హాస్యాన్ని పండించడంలో తమకు  సాటి ఎవరూ లేరని నిరూపించి,ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: